AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Puneeth Rajkumar: విడుదలకు సిద్దమైన పునీత్ చివరి సినిమా.. ఆర్మీ ఆఫీసర్‌గా అద్దరగొట్టనున్న అప్పు..

కన్నడ ప్రేక్షకుల ఆరాధ్య దైవం దివంగత హీరో పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’. చేతన్ కుమార్ దర్శకత్వంలో కిశోర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కిశోర్ పత్తికొండ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు.

Puneeth Rajkumar: విడుదలకు సిద్దమైన పునీత్ చివరి సినిమా.. ఆర్మీ ఆఫీసర్‌గా అద్దరగొట్టనున్న అప్పు..
Puneeth Rajkumar
Rajeev Rayala
|

Updated on: Mar 11, 2022 | 6:15 AM

Share

Puneeth Rajkumar : కన్నడ ప్రేక్షకుల ఆరాధ్య దైవం దివంగత హీరో పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’. చేతన్ కుమార్ దర్శకత్వంలో కిశోర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కిశోర్ పత్తికొండ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. రిపబ్లిక్ డే‌కి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, రీసెంట్‌గా విడుదల చేసిన ‘ట్రేడ్ మార్క్’ లిరికల్ వీడియో సాంగ్‌ ట్రెమండస్ రెస్పాన్స్‌ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. పునీత్ మరణించే సమయానికి జేమ్స్ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. అయితే డబ్బింగ్ మాత్రం కాలేదు. పునీత్ వాయిస్ ను మిమిక్రీ ఆర్టిస్ట్ ద్వారా ప్రయతించినా కూడా వర్కౌట్ అవ్వలేదట.. దాంతో పునీత్ పాత్రకు ఆయన అన్న శివకుమార్ డబ్బింగ్ చెప్పారు. తమ్ముడి పాత్రకు డబ్బింగ్ చెప్తూ.. చాలా సార్లు కన్నీళ్లు పెట్టుకున్నారట శివన్న. ఇదిలా ఉంటే ఇక ఈ సినిమా షూటింగ్ అనంతర కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలను సిద్ధం అయ్యింది.

చిత్రాన్ని పునీత్ రాజ్‌కుమార్ జయంతిని పురస్కరించుకుని మార్చి 17న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని హీరో శ్రీకాంత్, విజయ్. ఎమ్‌ సంయుక్తంగా తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. పునీత్ రాజ్‌కుమార్ ఆర్మీ ఆఫీసర్‌గా నటించిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియా ఆనంద్ నటించగా, విలన్‌గా టాలీవుడ్ హీరో శ్రీకాంత్ నటించారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయని, మార్చి 17న చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నామని.. హీరో శ్రీకాంత్‌తో కలిసి ఈ చిత్రాన్ని టాలీవుడ్‌లో విడుదల చేస్తున్న విజయ్. ఎమ్ తెలిపారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Andhra Pradesh: మాకు కొన్ని సినిమా టికెట్లివ్వండి.. మూవీ థియేటర్ యాజమాన్యాలను కోరిన విజయవాడ మేయర్..!

Shamna Kasim: అదిరే అందాలతో ఫిదా చేసిన పూర్ణ.. వావ్ అనాల్సిందే

Viral Photo: క్యూట్‏నెస్ ఓవర్‏లోడేడ్.. నవ్వుతోనే అట్రాక్ట్ చేస్తోన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి.. యూత్‏లో యమ క్రేజ్..