AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shruti Haasan: మెగాస్టార్ సినిమా కోసం అందాల శృతి హాసన్ అంత ఛార్జ్ చేస్తుందా..?

అందాల భామ శృతిహాసన్ అనగనగా ఒక ధీరుడు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. వరుస సినిమాలతో చాలా బిజీగా మారింది. ఆ తర్వాత వరుస ప్లాపులతో నెట్టుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.

Shruti Haasan: మెగాస్టార్ సినిమా కోసం అందాల శృతి హాసన్ అంత ఛార్జ్ చేస్తుందా..?
Shruti Haasan
Rajeev Rayala
| Edited By: Rajitha Chanti|

Updated on: Mar 11, 2022 | 6:30 AM

Share

Shruti Haasan: అందాల భామ శృతిహాసన్ అనగనగా ఒక ధీరుడు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. వరుస సినిమాలతో చాలా బిజీగా మారింది. ఆ తర్వాత వరుస ప్లాపులతో నెట్టుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో హిట్ అందుకుంది శ్రుతి. ఈ సినిమాతో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ మూవీ తర్వాత తెలుగులో వరుస ఆఫర్లు అందుకుంటూ టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది. అయితే కొద్ది కాలం సినిమాలకు దూరంగా ఉన్న శ్రుతి హాసన్.. ఇటీవల రవితేజ నటించిన క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ప్రభాస్.. ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా సలార్ లో నటిస్తోంది. అలాగే గోపిచంద్ మలినేని.. నందమూరి నటసింహం కాంబోలో రాబోతున్న మూవీలోనూ శ్రుతి హాసన్ నటిస్తోంది. గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీని వేటపాలెం పరిసర ప్రాంతాల్లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు.

ఇక ఈ అమ్మడుమెగాస్టార్ చిరంజీవి సరసన ఛాన్స్ దక్కించుకుంది. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. బాబీ దర్శకత్వంలో చిరు నటిస్తున్న సినిమా వాల్తేరు వీరన్న. ఈ సినిమాలో శృతి హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. ఈ విషయాన్ని ఇటీవల మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇదిలా వుంటే ఈ క్రేజీ మూవీ కోసం శృతిహాసన్ ఎంత రెమ్యునరేషన్ అందుకుంటుందన్నది ఇప్పుడు  హాట్ టాపిక్ గా మారింది. బాలకృష్ణ చిత్రానికి కోటిన్నర మాత్రమే ఛార్జ్ చేసిన శృతిహాసన్ మెగాస్టార్ మూవీకి మాత్రం 2 కోట్లు డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ రెండు చిత్రాలని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Andhra Pradesh: మాకు కొన్ని సినిమా టికెట్లివ్వండి.. మూవీ థియేటర్ యాజమాన్యాలను కోరిన విజయవాడ మేయర్..!

Shamna Kasim: అదిరే అందాలతో ఫిదా చేసిన పూర్ణ.. వావ్ అనాల్సిందే

Viral Photo: క్యూట్‏నెస్ ఓవర్‏లోడేడ్.. నవ్వుతోనే అట్రాక్ట్ చేస్తోన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి.. యూత్‏లో యమ క్రేజ్..