ప్రభాస్ నెక్ట్స్ మూవీ ఆ డైరక్టర్‌తోనేనా..!
ఇటీవల సాహోతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్.. ఆ మూవీతో అందరి అంచనాలను అందుకోలేకపోయాడు. ప్రస్తుతం ఈ హీరో జిల్ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో జాన్(అనధికార టైటిల్)మూవీలో నటిస్తున్నాడు. పీరియాడిక్ రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇక ఈ చిత్రంలో పూజా హెగ్డే మొదటిసారిగా ప్రభాస్ సరసన ఆడిపాడుతోంది. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక […]
ఇటీవల సాహోతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్.. ఆ మూవీతో అందరి అంచనాలను అందుకోలేకపోయాడు. ప్రస్తుతం ఈ హీరో జిల్ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో జాన్(అనధికార టైటిల్)మూవీలో నటిస్తున్నాడు. పీరియాడిక్ రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇక ఈ చిత్రంలో పూజా హెగ్డే మొదటిసారిగా ప్రభాస్ సరసన ఆడిపాడుతోంది. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక ఈ మూవీ తరువాత ప్రభాస్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన సైరా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్‌ను తెచ్చుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సినిమాలో సురేందర్ రెడ్డి టేకింగ్‌కు మంచి మార్కులు పడగా.. విమర్శకులు కూడా ప్రశంసలు కురిపించారు. దీంతో అతడి దర్శకత్వంలో నటించేందుకు ప్రభాస్ చాలా ఆసక్తిని చూపిస్తున్నాడట. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సురేందర్ రెడ్డి ప్రభాస్ కోసం కథను రెడీ చేశాడని.. దానికి అతడి నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే.. త్వరలోనే ఈ మూవీని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారని టాక్. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.