AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాక్సాఫీస్ షేక్ అయ్యే కాంబినేషన్..రాజమౌళి-మహేశ్ ఫిక్సయ్యారా?

సౌత్ ఇండియాలో ప్లాపులేని టాప్ డైరక్టర్ ఎవరైనా ఉన్నారా అంటే..అతడు కేవలం రాజమౌళి మాత్రమే. ఇక ‘బాహుబిలి’ తో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేశాడు జక్కన్న. ప్రస్తుతం ఈ ఏస్ డైరక్టర్ రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఆర్.ఆర్.ఆర్ చిత్రం చేస్తున్నాడు. అయితే నిన్న రాజమౌళి46వ పుట్టిన రోజు వేడకను జరుపుకున్నాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పలువురు స్టార్స్, సెలబ్రిటీస్  ఆయనకు బర్త్ డే విషెస్ తెలియజేశారు. అందరి శుభాకాంక్షలు పక్కన […]

బాక్సాఫీస్ షేక్ అయ్యే కాంబినేషన్..రాజమౌళి-మహేశ్ ఫిక్సయ్యారా?
Ram Naramaneni
| Edited By: |

Updated on: Oct 11, 2019 | 8:00 PM

Share

సౌత్ ఇండియాలో ప్లాపులేని టాప్ డైరక్టర్ ఎవరైనా ఉన్నారా అంటే..అతడు కేవలం రాజమౌళి మాత్రమే. ఇక ‘బాహుబిలి’ తో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేశాడు జక్కన్న. ప్రస్తుతం ఈ ఏస్ డైరక్టర్ రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఆర్.ఆర్.ఆర్ చిత్రం చేస్తున్నాడు. అయితే నిన్న రాజమౌళి46వ పుట్టిన రోజు వేడకను జరుపుకున్నాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పలువురు స్టార్స్, సెలబ్రిటీస్  ఆయనకు బర్త్ డే విషెస్ తెలియజేశారు.

అందరి శుభాకాంక్షలు పక్కన పెడితే..  సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి కి బర్త్ డే విషెస్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. “హ్యాపీ బర్త్ డే రాజమౌళి గారు. మీరు ఇలానే ఫిల్మ్ మేకర్స్‌కి స్పూర్తిని ఇవ్వాలని ఆశిస్తున్నాను ” అని ట్వీట్ చేశారు. ఇక మహేష్ ఇప్పటివరకు రాజమౌళితో ఒక్క సినిమా కూడా తీయలేదు. త్వరలో జక్కన్న మహేష్ తో సినిమా తీస్తున్నాడనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీ అంతా వ్యాపిస్తుంది. అసలు ఎప్పటి నుండో రాజమౌళి– మహేష్ బాబుల కాంబినేషన్ లో సినిమా రావాల్సి ఉండే కానీ అది వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. అయితే  ‘ఆర్ఆర్‌ఆర్‌’ అయ్యాక మాత్రం మహేష్ బాబు తో రాజమౌళి సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది . ఇక ఆ సినిమాని బాహుబలిని నిర్మించిన ఆర్కా మీడియా నిర్మించనుందని టాక్.

మహేష్ బాబు – ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో సినిమా అంటే ఫ్యాన్స్ కు పూనకం రావడం ఖాయం. ఈ రేంజ్ కాంబినేషన్ కోసం టాలీవుడ్ ఎప్పటినుంచో ఎదురుచూస్తోంది.  మొత్తానికి మహేష్ ఫ్యాన్స్ కల నెరవేరుతోందన్న మాట . ఇకపోతే ఇది అఫిషియల్ ఇన్ఫర్మేషన్ కాదు. కానీ జక్కన్న బాహుబలి సిరీస్ తర్వాాత..చాలాకాలం సస్పెన్స్ మెయింటైన్ చేసి.. ఇండస్ట్రీలోనే టాప్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో మల్టీస్టారర్ మూవీ ఎనౌన్స్ చేసి అందరికి సర్ప్రైజ్ ఇచ్చాడు. వీరు ముగ్గురు కలిసి దిగిన ఫోటో బయటకు వచ్చే వరకు అసలు ఇలాంటి కాంబినేషన్ సెట్ అవుతుందని కూడా ఎవరూ ఊహించలేదు. మరి రాజమౌళి అలాంటి సర్ఫ్రైజ్ రెడీ చేసుకుని ఉన్నాడో, లేదో తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే.

Follow Us
రోహిణీ కార్తె ఎండల్లో ఇంటి పైకప్పును చల్లగా ఉంచే అద్భుతమైన చిట్కా
రోహిణీ కార్తె ఎండల్లో ఇంటి పైకప్పును చల్లగా ఉంచే అద్భుతమైన చిట్కా
అన్నం తినేటప్పుడు నీళ్లు తాగుతున్నారా? మీ పొట్టలో ఏం జరుగుతుందో..
అన్నం తినేటప్పుడు నీళ్లు తాగుతున్నారా? మీ పొట్టలో ఏం జరుగుతుందో..
IPL మ్యాచ్‌కు వెళ్లే ఫ్యాన్స్ కు బిగ్ అలర్ట్.. గంట ముందే..
IPL మ్యాచ్‌కు వెళ్లే ఫ్యాన్స్ కు బిగ్ అలర్ట్.. గంట ముందే..
ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. క్షణాల్లో బూడిదైన 8 సీఎన్జీ కార్లు
ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. క్షణాల్లో బూడిదైన 8 సీఎన్జీ కార్లు
రోజాతో విభేదాలపై హైపర్ ఆది ఏమన్నాడంటే?
రోజాతో విభేదాలపై హైపర్ ఆది ఏమన్నాడంటే?
తెల్లగా మెరిసిపోవాలని ఆశపడుతున్నారా..? ముఖంపై సూది పడితే..
తెల్లగా మెరిసిపోవాలని ఆశపడుతున్నారా..? ముఖంపై సూది పడితే..
ఈ ఎలక్ట్రిక్ కారుకు ఏమైంది.. క్షణాల్లోనే బీభత్సం.. ఆ తర్వాత..
ఈ ఎలక్ట్రిక్ కారుకు ఏమైంది.. క్షణాల్లోనే బీభత్సం.. ఆ తర్వాత..
అరుదైన రికార్డ్! పదో తరగతిలో ఈ కవలలకు సేమ్ మార్కులు!
అరుదైన రికార్డ్! పదో తరగతిలో ఈ కవలలకు సేమ్ మార్కులు!
పొరపాటున రాంగ్ బ్లడ్ గ్రూప్ ఎక్కిస్తే బాడీలో ఏం జరుగుతుంది? ..
పొరపాటున రాంగ్ బ్లడ్ గ్రూప్ ఎక్కిస్తే బాడీలో ఏం జరుగుతుంది? ..
శకున శాస్త్రం: ఈ సమయంలో తుమ్మితే మీరు అదృష్టవంతులు!
శకున శాస్త్రం: ఈ సమయంలో తుమ్మితే మీరు అదృష్టవంతులు!