Project k: ప్రభాస్ ప్రాజెక్ట్ కే అప్‌డేట్ చూశారా.? మూవీ హాలీవుడ్ రేంజ్‌లో ఉండేలా ఉందే..
ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా దీపికా పదుకొణె నటిస్తుండగా, బిగ్‌బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు...
ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా దీపికా పదుకొణె నటిస్తుండగా, బిగ్‌బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ చిన్న అప్‌డేట్‌ను ఇచ్చింది. నిజానికి చిన్న అప్‌డేట్ అయినప్పటికీ సినిమా కాన్సెప్ట్ ఏంటన్న దానిపై ఓ క్లారిటీ వచ్చేసింది.
ఈ అప్‌డేట్‌లో కేవలం ప్రభాస్ చేయిని చూపించారు. అయితే ఈ చేయి సూపర్ హీరోలను పోలి ఉండడం విశేషం. దీంతో ప్రాజెక్ట్ కే కచ్చితంగా హాలీవుడ్ రేంజ్‌లో ఉండేలా ఉందన్న వార్తలకు బలం చేకూర్చినట్లైంది. ఈ ఫొటోతో పాటు.. ‘హీరోలు పుట్టరు. ఉద్భవిస్తారు’ అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే ప్రాజెక్ట్ కే చిత్రం టైమ్ ట్రావెలింగ్ నేపథ్యంలో తెరకెక్కనుందని గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై చిత్ర యూనిట్ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
Here’s wishing our Darling #Prabhas a Super Happy Birthday.#ProjectK #HappyBirthdayPrabhas pic.twitter.com/DwqMXNXHTO
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) October 23, 2022
ఇక అనంతరం ఈ సినిమా మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సైన్స్ ఫిక్షన్ కథాంశంతో సూపర్‌హీరో మూవీగా రానుందన్న వార్తలు వచ్చాయి. తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసిన అప్‌డేట్‌తో ఈ విషయంపై క్లారిటీ వచ్చింది. ప్రాజెక్ట్ కే సూపర్ హీరో ఓరియెంటెడ్ మూవీ అని స్పష్టత వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. అత్యంత భారీ బడ్జెట్, భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి రికార్డులు తిరిగరాస్తుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..