Aha OTT: ఓటీటీలో అదిరిపోయే రెస్పాన్స్‏తో దూసుకుపోతున్న స్పోర్ట్స్ డ్రామా.. ‘ఆహా’ ఎక్కడ చూడొచ్చంటే..

ఈ క్రమంలో ఇప్పటికే చాలా సినిమాలను తీసుకువచ్చింది. తాజాగా మలయాళంలో సూపర్ హిట్ అయిన స్పోర్ట్స్ డ్రామా 'ఆహా' చిత్రాన్ని అడియన్స్ ముందుకు తీసుకువచ్చింది. 2021లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దాదాపు మూడేళ్ల తర్వాత ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది

Aha OTT: ఓటీటీలో అదిరిపోయే రెస్పాన్స్‏తో దూసుకుపోతున్న స్పోర్ట్స్ డ్రామా.. 'ఆహా' ఎక్కడ చూడొచ్చంటే..
Aha Movie 2024
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 12, 2024 | 5:58 PM

ఇటీవల ఓటీటీ ప్లాట్ ఫామ్స్‏లో సూపర్ హిట్ సినిమాలు, ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ప్రముఖ ఓటీటీ మాధ్యమం ఆహా.. ఎప్పటికప్పుడు ఇతర భాషలలో హిట్ అయిన సినిమాలను తెలుగు వెర్షన్ లోకి తీసుకువస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే చాలా సినిమాలను తీసుకువచ్చింది. తాజాగా మలయాళంలో సూపర్ హిట్ అయిన స్పోర్ట్స్ డ్రామా ‘ఆహా’ చిత్రాన్ని అడియన్స్ ముందుకు తీసుకువచ్చింది. 2021లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దాదాపు మూడేళ్ల తర్వాత ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విషయాన్ని ఇదివరకే ఆహా అధికారికంగా ప్రకటించింది. బిబిన్ పాల్ శ్యామూల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గత అర్దరాత్రి (సెప్టెంబర్ 12) నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.

అయితే ఆహాలో విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. కేరళలో బాగా పాపులర్ అయిన టగ్ ఆఫ్ వార్ గేమ్ గురించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో ఇంద్రజిత్ సుకుమారన్, మనోజ్ కె. జయన్ ప్రధాన పాత్రలలో నటించగా.. ఈ మలయాళం స్పోర్ట్స్ డ్రామా మూవీ ‘ఆహా’ చిత్రానికి బిబిన్ పాల్ శామ్యూల్ దర్శకత్వం. Zsa Zsa ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రేమ్ అబ్రహం నిర్మించిన ఈ చిత్రానికి సయనోరా ఫిలిప్, షియాద్ కబీర్ సంగీతం అందించారు.

ఇవి కూడా చదవండి

1980, 1990లలో బాగా ప్రాచుర్యం పొందిన టగ్ ఆఫ్ వార్ టీమ్ నుండి ప్రేరణ పొందిన రూపొందిన ఈ చిత్రం అందరి ప్రసంశలు అందుకుంది. ఈ సినిమాలోని ఓ టీమ్ యువకులు పగటి సమయంలో వేర్వేరు పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటారు. కానీ రాత్రిళ్లు తమ గ్రామానికి చేరుకుని టగ్ ఆఫ్ వార్ గేమ్ ఆడేవారు. చివరగా ఆ యువకులు ఏం సాధించారనేది ఈ చిత్రం. తాజాగా ఈ చిత్రం భవానీ మీడియా ద్వారా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ తో దూసుకుపోతోంది.

Aha Tweet: 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.