Parakramam OTT: ఓటీటీలోకి బండి సరోజ్ కుమార్ లేటెస్ట్ మూవీ.. పరాక్రమం స్ట్రీమింగ్ ఎక్కడంటే?
నిర్బంధం, మాంగల్యం, సూర్యాస్తమయం.. లాంటి బోల్డ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు బండి సరోజ్ కుమార్. కేవలం నటుడిగానే కాదు డైరెక్టర్ గానూ సత్తా చాటాడు. అయితే ఇప్పటివరకు తన సినిమాలన్నీ డైరెక్టుగా యూట్యూబ్ లోనే రిలీజయ్యాయి. తొలిసారి పరాక్రమం సినిమాతో సిల్వర్ స్క్రీన్ పైకి అడుగుపెట్టాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. ఇందులో హీరోగా నటిస్తూ దర్శకత్వం కూడా వహించాడు బీస్‌కే. అంతేకాదు బి.ఎస్.కె మెయిన్ స్ట్రీమ్ బ్యానర్‌పై అతనే ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించాడు.
నిర్బంధం, మాంగల్యం, సూర్యాస్తమయం.. లాంటి బోల్డ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు బండి సరోజ్ కుమార్. కేవలం నటుడిగానే కాదు డైరెక్టర్ గానూ సత్తా చాటాడు. అయితే ఇప్పటివరకు తన సినిమాలన్నీ డైరెక్టుగా యూట్యూబ్ లోనే రిలీజయ్యాయి. తొలిసారి పరాక్రమం సినిమాతో సిల్వర్ స్క్రీన్ పైకి అడుగుపెట్టాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. ఇందులో హీరోగా నటిస్తూ దర్శకత్వం కూడా వహించాడు బీస్‌కే. అంతేకాదు బి.ఎస్.కె మెయిన్ స్ట్రీమ్ బ్యానర్‌పై అతనే ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించాడు. సంగీతం కూడా అందించాడు. బండి సరోజ్ కుమార్ ట్యాలెంట్ తెలిసి పరాక్రమం సినిమా ప్రమోషన్లలో పలువురు యంగ్ హీరోలు పాల్గొనడం విశేషం. ఇక టీజర్లు, ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉండడంతో బీఎస్కే సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్టుగానే ఆగస్టు 22న థియేటర్లలో విడుదలైన ‘పరాక్రమం’ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రివ్యూలు కూడా పాజిటివ్ గా వచ్చాయి. ఇక పరాక్రమం మూవీకి ఐఎండీబీలో 7.7 రేటింగ్ ఉండటం విశేషం. థియేటర్లలో ఆడియెన్స్ ను ఓ మోస్తరుగా అలరించిన ఈ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా పరాక్రమం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. తాజాగా బీఎస్కే మూవీ ఓటీటీ రిలీజ్ పై అధికారిక ప్రకటన వెలువరించింది.
పరాక్రమం సినిమా సెప్టెంబర్ 14 నుంచి ఓటీటీలోకి రానుంది. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది ఆహా. ‘పులి వస్తే చెట్టెక్కుతావ్.. మగర్ మచ్చీ వస్తే ఒడ్డెక్కుతావ్.. యముడొస్తే ఏడికి పోతావ్.. బండి సరోజ్ పరాక్రమం సెప్టెంబర్ 14 నుంచి ఆహాలో’ అంటూ ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను పంచుకుంది. పరాక్రమం సినిమాలో నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్, శాంక్ వెన్నెలకంటి, వంశీరాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. మరి థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యారా? అయితే రెండు రోజులు ఆగండి.. ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఎంచెక్కా ఇంట్లోనే కూర్చోని ఎంజాయ్ చేయండి.
సెప్టెంబర్ 14 నుంచి ఆహాలో స్ట్రీమింగ్
పులి వస్తే చెట్టుక్కుతావ్!🐅 మగర్ మచ్చొస్తే ఒడ్డెక్కుతావ్!! యముడొస్తే ఏడికి పోతావ్….😈 Bandi Saroj’s Parakramam on aha🎬#Parakramam Premieres 14th September on aha! @publicstar_bsk @actoranilkumar @06sudheer @nikhilgopureddy pic.twitter.com/VqeiY5APsk
— ahavideoin (@ahavideoIN) September 12, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.