The GOAT Movie: ఓటీటీలోకి వచ్చేస్తోన్న విజయ్ దళపతి ‘ది గోట్’.. ఎక్కడ, ఎప్పుడు స్ట్రీమింగ్ కానుందంటే..

సెప్టెంబర్ 5న విడుదలైన ఈ మూవీలో త్రిష, మీనాక్షి చౌదరి, ప్రశాంత్, స్నేహ, వైభవ్, లైలా, ప్రభుదేవా కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాయంతో దివంగత నటుడు విజయ్ కాంత్ రూపాన్ని కూడా చూపించారు. ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్

The GOAT Movie: ఓటీటీలోకి వచ్చేస్తోన్న విజయ్ దళపతి 'ది గోట్'.. ఎక్కడ, ఎప్పుడు స్ట్రీమింగ్ కానుందంటే..
The Goat Movie
Follow us

|

Updated on: Oct 01, 2024 | 11:40 AM

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ ది గోట్. డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా ఇటీవలే అడియన్స్ ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకుంది. తమిళంతోపాటు తెలుగులోనూ విడుదలైన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా రికార్డులు సృష్టించినప్పటికీ మిశ్రమ స్పందన వచ్చింది. సెప్టెంబర్ 5న విడుదలైన ఈ మూవీలో త్రిష, మీనాక్షి చౌదరి, ప్రశాంత్, స్నేహ, వైభవ్, లైలా, ప్రభుదేవా కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాయంతో దివంగత నటుడు విజయ్ కాంత్ రూపాన్ని కూడా చూపించారు. ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ అధికారికంగా ప్రకటించింది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను అక్టోబర్ 3 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు కాసేపటి క్రితమే నెట్ ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో ఈ సినిమా అందుబాటులో ఉంటుందని తెలుపుతూ ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. ఈ చిత్రంలో హీరో శివకార్తికేయన్, త్రిష అతిథి పాత్రలలో కనిపించారు.

ఇవి కూడా చదవండి

కథ విషయానికి వస్తే..

స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ టీంలో ఏజెంట్ లా వర్క్ చేస్తుంటాడు గాంధీ (విజయ్ దళపతి). తన ఉద్యోగం గురించి తన భార్య అను (స్నేహ)కు అసలు చెప్పడు. ఓ మిషన్ కోసం థాయ్ ల్యాండ్ వెళ్లిన గాంధీ.. అక్కడ తన ఐదేళ్ల కొడుకు జీవన్ ను కోల్పోతాడు. దీంతో తన ఉద్యోగాన్ని వదిలేస్తాడు. ఆ బాధతోనే భార్య కూడా దూరం పెడుతుంది. 15 ఏళ్ల తర్వాత ఓ పని కోసం మాస్కోకు వెళ్లిన గాంధీకి తన కొడుకు జీవన్ కనిపిస్తాడు. ఓ రౌడీ బృందంలో చిక్కుకుని ఉన్న తన బిడ్డను కాపాడి భారత్ తీసుకువస్తాడు. దీంతో కుటుంబం మొత్తం కలిసి సంతోషంగా గడుపుతుంటారు. ఈ సమయంలోనే గాంధీ టీం బాస్ నజీర్ (జయరాం)ను ఎవరో చంపేస్తారు. ఆ తర్వాత ఆ టీంలో ఒక్కొక్కరు హత్యకు గురవుతుండగా.. ఆ హత్యలకు జీవన్ కు సంబంధమేంటీ.. ? తన తండ్రిని చంపాలని ఎందుకు పగబడతాడు ? అనేది సినిమా కథ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.