OTT Movie: ఓటీటీలో హాలీవుడ్ మూవీ.. ఫ్యామిలీతో కలిసి అసలు చూడొద్దు..
హాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాదిలో విడుదలైన అమెరికన్ రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామా 'ఛాలెంజర్స్' మూవీని ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. లూకా గ్వాడాగ్ని దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ 26న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. థియేటర్లలో విడుదలైన ఐదు నెలల తర్వాత ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. రూ.450 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్ సృష్టించింది.
ఇటీవల కొన్నిరోజులుగా సినీ ప్రియులను ఆకట్టుకునేందుకు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కొత్తగా ప్రయత్నిస్తున్నాయి. ఇతర భాషలలో సూపర్ హిట్ అయిన చిత్రాలను తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. హారర్, మిస్టరీ థ్రిల్లర్, సస్పెన్స్ మూవీస్ ఎక్కువగా విడుదల చేస్తున్న ఓటీటీలు ఇప్పుడు రొమాంటిక్ డ్రామాలను కూడా అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నాయి. తాజాగా హాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాదిలో విడుదలైన అమెరికన్ రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామా ‘ఛాలెంజర్స్’ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. లూకా గ్వాడాగ్ని దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ 26న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. థియేటర్లలో విడుదలైన ఐదు నెలల తర్వాత ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. రూ.450 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్ సృష్టించింది.
ఇక ఇప్పుడు ఈ రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఎలాంటి ప్రకటన లేకుండానే తెలుగుతోపాటు ఏకంగా 20 భాషలలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో హాలీవుడ్ పాపులర్ నటి జెండాయ ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమాకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చింది.
కథ విషయానికి వస్తే..
టెన్నిస్ గేమ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథ సాగుతుంది. టెన్నిస్ ఛాంపియన్ గా గుర్తింపు తెచ్చుకున్న తాషి (జెండాయ) కోచ్ గా మారి తన భర్తను ఛాంపియన్ గా తీర్చిదిద్దుతుంది. ఈ క్రమంలోనే తన మాజీ బాయ్ ఫ్రెండ్ వీరిద్దరి జీవితాల్లోకి ఎంటర్ అవుతాడు. ఆ తర్వాత వీరి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది.. ? తాషి మాజీ బాయ్ ఫ్రెండ్ వల్ల ఆమె కుటుంబం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొవాల్సి వచ్చింది ? అనేది సినిమా. ఈ మూవీలో అక్కడక్కడా బోల్డ్ సీన్స్ ఉంటాయి. కాబట్టి ఫ్యామిలీతో కలిసి చూడడం కాస్త ఇబ్బందిగా ఉండొచ్చు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.