Bichagadu 2 OTT: ఓటీటీలోకి వచ్చేసిన రీసెంట్ బ్లాక్ బస్టర్.. బిచ్చగాడు 2 సినిమాను ఎక్కడ చూడొచ్చంటే?
కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగా, మ్యూజిక్ కంపోజర్‌గా, సింగర్‌గా తన ట్యాలెంట్‌ను చాటుకుంటున్నాడు విజయ్. తాజాగా బిచ్చగాడు 2 సినిమాతో మొదటిసారి మెగా ఫోన్ పట్టుకున్నాడు. డైరెక్టర్‌గా మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు.
నకిలీ, డాక్టర్ సలీమ్, బిచ్చగాడు సినిమాలతో సౌత్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ ఆంటోని. తెలుగు నాట కూడా ఈ హీరోకు చాలామంది అభిమానులున్నారు. కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగా, మ్యూజిక్ కంపోజర్‌గా, సింగర్‌గా తన ట్యాలెంట్‌ను చాటుకుంటున్నాడు విజయ్. తాజాగా బిచ్చగాడు 2 సినిమాతో మొదటిసారి మెగా ఫోన్ పట్టుకున్నాడు. డైరెక్టర్‌గా మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. మే 16న తమిళ్‌తో పాటు తమిళంలోనూ రిలీజైన బిచ్చగాడు 2 సినిమా బాక్సాఫీస్ వద్ద క్లీన్ హీట్‌గా నిలిచింది. మొదటి పార్ట్‌లో మదర్ సెంటిమెంట్‌ను అద్భుతంగా చూపిస్తే, రెండో భాగంలో అన్నా- చెల్లెళ్ల మధ్య అనుబంధాన్ని చక్కగా చూపించారు. అందుకే తమిళ్‌లో కంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. థియేటర్లలో అమితంగా ఆకట్టుకున్న బిచ్చగాడు 2 ఓటీటీ రిలీజ్ డేట్ కోసం సినిమా ప్రియులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఇప్పుడీ నిరీక్షణకు తెరపడింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్ని ప్లస్ హాట్ స్టార్ బిచ్చగాడు 2 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈక్రమంలో ఆదివారం (జూన్ 18) అర్ధరాత్రి నుంచి ఈ సినిమా డిస్నీప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
తమిళ్‌తో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో బిచ్చగాడు 2 సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో విజయ్ ఆంటోని సరసన కావ్యా థాపర్ కథానాయికగా నటించింది. అలాగే రాధారవి, హరీశ్ పేరడి, రాజా కృష్ణమూర్తి, దేవ్ గిల్, వైజీ మహేంద్రన్ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఇక ఈ సినిమాకు విజయ్ ఆంటోని సతీమణి ఫాతిమా నిర్మాతగా వ్యవహరించడం విశేషం. మరి థియేటర్లలో విజయ్ బిచ్చగాడు 2 సినిమాను మిస్ అయిన వారు, మళ్లీ చూడాలనుకున్న వాళ్లు ఎంచెక్కా ఓటీటీలో చూసి ఆనందించండి.
#Bichagadu2 pic.twitter.com/SZeXEwtBIe
— OTTGURU (@OTTGURU1) June 18, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.