Venkatesh: నేను నా గురించి మాత్రమే ఆలోచిస్తాను.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వెంకీ మామా..

Venkatesh: యాక్షన్‌, రొమాంటిక్‌, కామెడీ... ఇలా ఏ జానర్‌లో సినిమాలో అయినా ఇట్టే ఒదిగిపోయే హీరోల్లో వెంకటేశ్‌ ఒకరు. సీనీయర్‌ హీరో అయినప్పటికీ మారుతోన్న కాలానికి అనుగుణంగా తనను తాను మార్చుకుంటూ..

Venkatesh: నేను నా గురించి మాత్రమే ఆలోచిస్తాను.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వెంకీ మామా..
Venkatesh
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 19, 2021 | 6:42 AM

Venkatesh: యాక్షన్‌, రొమాంటిక్‌, కామెడీ… ఇలా ఏ జానర్‌లో సినిమాలో అయినా ఇట్టే ఒదిగిపోయే హీరోల్లో వెంకటేశ్‌ ఒకరు. సీనీయర్‌ హీరో అయినప్పటికీ మారుతోన్న కాలానికి అనుగుణంగా తనను తాను మార్చుకుంటూ సరికొత్త పంథాలో సినిమాలు చేస్తున్నారు వెంకటేశ్‌. మల్టీ స్టారర్‌ చిత్రాల్లో నటించినా.. నారప్ప వంటి ప్రయోగాత్మక చిత్రాల్లో కనిపించినా ఆయనకే దక్కింది. ఈ క్రమంలోనే వెంకీ ప్రస్తుతం నటించి దృశ్యం 2 చిత్రం ఈ నెల 25న అమేజాన్‌ వేదికగా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వెంకటేష్‌ ఈ సిసిమా విశేషాలతో పాటు మరికొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను అదృష్టం కొద్దీ సినిమా రంగంలోకి వచ్చాను. ప్రేక్షకుల అభిమానం దొరికింది. ఇన్నేళ్లయినా నాపై అభిమానం చూపిస్తూనే ఉన్నారు. కొత్తగా నటించేందుకు ప్రయత్నిస్తునున్నాను. ఎప్పుడూ ఇమేజ్‌ గురించి ఆలోచించను. నేను నా గురించి మాత్రమే ఆలోచిస్తాను’ అని చెప్పుకొచ్చారు. ఇక దృశ్యం 3 వస్తుందా అన్న ప్రశ్నకు స్పందించిన వెంకటేశ్‌.. ‘మూడో పార్ట్ ఉంటుందో లేదో నాకు తెలీదు. అయితే ఈ సారి మాత్రం చాలా టైం పడుతుందని మాత్రం చెప్పారు. మూడు నాలుగేళ్లు పట్టొచ్చు. ఈ సారి తెల్లగడ్డంతో కనిపించినా ఆశ్యర్యపోవాల్సిన అవ‌స‌రం లేద’ని తెలిపారు.

ఇక ఓటీటీలో సినిమాలు విడుదలుతున్నాయన్న బాధ ఎఫ్‌3తో పోతుందని తెలిపిన వెంకీ.. డబ్బు చుట్టు తిరిగే కథాంశంతో వస్తోన్న ఎఫ్‌3కి అందరూ కనెక్ట్ అవుతారని చెప్పుకొచ్చారు. ఇక విజయాలను, వైఫల్యాలను ఒకేలా తీసుకోవాలని చెప్పిన వెంకీ.. హిట్ అయినా ఫ్లాప్ అయినా ఎక్కువగా స్పందించకూడదు. కానీ ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకుని పాఠాలు నేర్చుకోవాలని తెలిపారు.

Also Read: Sneeze Problems: తరచుగా తుమ్ములు వస్తున్నాయా? అయితే ఇలా చేసి తుమ్ములను నియంత్రించండి..!

CM Jagan Review: వారికి తక్షణమే రూ.1000 ఇవ్వండి.. జల విలయంపై సీఎం జగన్ ఎమర్జెన్సీ రివ్యూ..

Zodiac Signs: ఈ 5 రాశుల వారు ఎప్పుడూ పుస్తకాలు చదువుతూనే ఉంటారట.. ఆ రాశులేంటో తెలుసుకోండి..