AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balagam OTT: బలగం ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. ఆరోజునుంచే స్ట్రీమింగ్‌! ఎందులో అంటే?

స్వచ్ఛమైన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ తెరకెక్కించిన చిత్రం బలగం. జబర్దస్త్‌ కమెడియన్‌ వేణు డైరెక్టర్‌గా టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌ రామ్‌ హీరో, హీరోయిన్లుగా నటించారు

Balagam OTT: బలగం ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. ఆరోజునుంచే స్ట్రీమింగ్‌! ఎందులో అంటే?
Balagam Ott
Basha Shek
|

Updated on: Mar 23, 2023 | 9:12 AM

Share

స్వచ్ఛమైన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ తెరకెక్కించిన చిత్రం బలగం. జబర్దస్త్‌ కమెడియన్‌ వేణు డైరెక్టర్‌గా టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌ రామ్‌ హీరో, హీరోయిన్లుగా నటించారు. ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు స‌మ‌ర్పణలో ఆయ‌న కూతురు హ‌న్షిత‌, హ‌ర్షిత్‌రెడ్డి బ‌ల‌గం సినిమాను తెరకెక్కించారు. చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచింది. వేణు మెగా ఫోన్‌ మొదటిసారిగా పట్టుకున్నా అద్భుతంగా సినిమాను తెరకెక్కించాడంటూ మెగాస్టార్‌ చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. దైనందిన జీవితాల్లో మాయమైపోతున్న కుటుంబ బంధాలను చక్కగా చూపించారు ఈ సినిమాలో. చాలా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రిలీజైన వారం రోజుల్లోనే లాభాల బాట పట్టింది. ఇప్పటికీ థియేటర్లలో సందడి చేస్తోన్న ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో బలగం డిజిటల్‌ స్ట్రీమింగ్‌ గురించి సోషల్‌ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. త్వరలోనే ఈ సినిమాను ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనడమే ఈ వార్తల సారాంశం.

బలగం సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. అన్నీ కుదిరితే ఏప్రిల్‌ మొదటివారం (మార్చి 2)లో ఈ సినిమాను స్ట్రీమింగ్‌కి తీసుకురానున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు భీమ్స్‌ సిసిరోలియో అందించిన స్వరాలు చార్ట్‌ బస్టర్‌గా నిలిచాయి. అలాగే కాసర్ల శ్యాం అందించిన సాహిత్యం, మంగ్లీ ఆలపించిన పాట బలగం సినిమాకు హైలెట్‌గా నిలిచాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?