Drushyam 2: హీరో వెంకటేష్‌కు ఓటీటీ వేదిక మరో హిట్ అందిస్తుందా..?

దృశ్యం’ సినిమాకు సీక్వెల్‌గా వెంకటేష్ దగ్గుబాటి హీరోగా ఈ చిత్రం రాబోతోంది. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రాబోతోన్న ఈ సినిమాలో మీనా, నదియ, నరేష్, కృతిక, ఈస్తర్ అనిల్, సంపత్ రాజ్, పూర్ణ నటించారు.

Drushyam 2: హీరో వెంకటేష్‌కు ఓటీటీ వేదిక మరో హిట్ అందిస్తుందా..?
Venky
Follow us
Rajeev Rayala

| Edited By: Anil kumar poka

Updated on: Nov 14, 2021 | 8:20 AM

Drushyam 2: దృశ్యం’ సినిమాకు సీక్వెల్‌గా వెంకటేష్ దగ్గుబాటి హీరోగా ఈ చిత్రం రాబోతోంది. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రాబోతోన్న ఈ సినిమాలో మీనా, నదియ, నరేష్, కృతిక, ఈస్తర్ అనిల్, సంపత్ రాజ్, పూర్ణ నటించారు. ఇండియా, ప్రపంచ వ్యాప్తంగా 240 దేశాల్లో ఉన్న ప్రైమ్ మెంబర్స్ నవంబర్ 25న తెలుగు థ్రిల్లర్ అయిన దృశ్యం 2 సినిమాను చూడబోతోన్నారు. వెంకటేష్ దగ్గుబాటి నటించిన తెలుగు థ్రిల్లర్ దృశ్యం 2 సినిమా నవంబర్ 25న విడుదల కాబోతోన్నట్టు అమెజాన్ వీడియో నేడు ప్రకటించింది. ఇండియాతో పాటుగా 240 దేశాల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది ఈ సినిమా. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రాన్ని.. ఆంటోని పెరంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి, సురేష్ బాబు కలిసి సురేష్ ప్రొడక్షన్స్, రాజ్ కుమార్ థియేటర్స్ అండ్ మ్యాక్స్ మూవీస్ బ్యానర్ల మీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

“ఆరేళ్ల తరువాత రాంబాబు జీవితంలో మళ్లీ ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి.. కేస్ ఇన్వెస్టిగేషన్ ఎలా మలుపు తిరిగింది.. తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు రాంబాబు ఎలాంటి ఎత్తులు వేశాడు? ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? కథలో ప్రతీ మలుపు అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. సీటు అంచున కూర్చోబెట్టేలా కథనం ఉంటుంది. ఇదిలా ఉంటే మలయాళంలో మోహన్ లాల్ నటించిన ఈ సీక్వెల్ కూడా ఓటీటీ వేదికగానే విడుదలైంది. అయితే మొదటి పార్ట్ తోపోల్చుకుంటే రెండో పార్ట్ అంతగా ఆకట్టుకోలేకపోయిందనే టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు తెలుగులో ఈ సీక్వెల్ రాబోతుంది. మరి తెలుగు ప్రేక్షకులను దృశ్యం 2 ఆకట్టుకుంటుందా లేక మలయాళం మాదిరిగానే యావరేజ్ అనిపించుకుంటుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే తెలుగు ప్రేక్షకులు థ్రిల్లర్ కథాంశాలను ప్రోత్సహిస్తారు కాబట్టి దృశ్యం 2 హిట్ అవ్వడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. ఇటీవలే అసురన్ రీమేక్ నారప్పతో సాలిడ్ హిట్ అనుకున్న వెంకీ .. దృశ్యం 2 తో కూడా విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటారని అంటున్నారు. చూడాలి మరి ఏంజరుగుతుందో..

మరిన్ని ఇక్కడ చదవండి : 

Nisha Agarwal: నిషా అగర్వాన్‌ను ఫోన్ నంబర్ అడిగిన్ నెటిజన్.. ఆమె రియాక్షన్ ఇదే..

Liger Movie: అమెరికాలో వాలిపోయిన లైగర్‌ బాయ్స్‌… మైక్‌టైసన్‌తో సన్నివేశాల కోసమేనా.?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. జబర్దస్త్ నుంచి ఔట్!

ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!