Varun Tej : నిహారిక విషయంలో మేము ఇన్వాల్వ్ అవ్వం.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వరుణ్ తేజ్

నిహారిక కొణిదల నిర్మాతగా మరి ఓ వెబ్ సిరీస్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. సంగీత్ శోభన్, సిమ్రాన్ శర్మ జంటగా... సీనియర్ నరేష్,

Varun Tej : నిహారిక విషయంలో మేము ఇన్వాల్వ్ అవ్వం.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వరుణ్ తేజ్
Niharika
Follow us
Rajeev Rayala

| Edited By: Anil kumar poka

Updated on: Nov 14, 2021 | 8:20 AM

Varun Tej : నిహారిక కొణిదల నిర్మాతగా మరి ఓ వెబ్ సిరీస్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. సంగీత్ శోభన్, సిమ్రాన్ శర్మ జంటగా… సీనియర్ నరేష్, తులసి, ‘గెటప్’ శీను ప్రధాన, ప్రమీల రాణి (భామ) పాత్రల్లో నటించిన ‘జీ 5’ ఒరిజినల్ వెబ్ సిరీస్ ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ (OCFS). పింక్ ఎలిఫెంట్స్ పిక్చర్స్ పతాకంపై మెగా డాటర్ నిహారికా కొణిదెల నిర్మించారు. మహేష్ ఉప్పాల దర్శకత్వం వహించారు. మొత్తం ఐదు ఎపిసోడ్స్ గల ఈ వెబ్ సిరీస్ నవంబర్ 19న ‘జీ 5’ ఓటీటీ వేదికలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ వెబ్ సిరీస్ గురించి హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

“బహుశా… ఏడాది క్రితం వెబ్ సిరీస్ చేస్తున్నట్టు నిహారిక చెప్పింది. స్టోరీ, టైటిల్ ఏమీ చెప్పలేదు అన్నారు. తనకెప్పుడూ ‘ఇది చెయ్, అది చెయ్’ అని చెప్పలేదు. ప్రయోగాలు చేస్తూ తన దారి వెతుక్కోవాలని అనుకుంటుంది. నిహారిక వర్క్ లో మేం ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వం. చూసి బావుందో, లేదో చెబుతాం అంతే అన్నారు వరుణ్. ఇటీవల ట్రైలర్ చూపించినప్పుడు నిజంగా నేను షాకయ్యా. ట్రైలర్ బావుంది. నాకు సంతోష్ శోభన్ తెలుసు. కానీ, తనకు బ్రదర్ ఉన్నాడని తెలియదు. ట్రైలర్ చూశాక… ‘ఈ అబ్బాయి ఎవరు? ఇంత బాగా చేస్తున్నాడు. ఇంతకు ముందు ఎన్ని సినిమాలు చేశాడు?’ అని అడిగా. తన టైమింగ్, యాక్టింగ్ అద్భుతంగా ఉన్నాయి. అనుభవం ఉన్న నటుడిలా చేశాడు అన్నారు వరుణ్.

నేను ఈ వెబ్ సిరీస్ చూడాలని అనుకోవడానికి గల కారణాల్లో అతడూ ఒకడు. సంతోష్, సంగీత్ ను చూసి వాళ్ల నాన్నగారు గర్వపడతారు. నరేష్ గారి లాంటి ఆర్టిస్ట్ సినిమాలతో పాటు ఓటీటీ ప్రాజెక్టులు చేయడం కొత్తవాళ్లకు చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది. అందరూ సినిమా క్వాలిటీలో ఉందని చెబుతున్నారు. పోను పోనూ సినిమాకు, ఓటీటీకి డిఫరెన్స్ ఉండదు. మనం చూసే మీడియమ్ డిఫరెంట్ అవ్వొచ్చు. సినిమా అంటే థియేటర్లు, ఓటీటీ అంటే ఇంట్లో చూడవచ్చు. అందరం కంటెంట్ ను నమ్ముకుని వచ్చినవాళ్లం. సినిమా వల్ల చాలామందికి ఒక ఫ్లాట్‌ఫార్మ్ ఉంటుంది అన్నారు. బయట ఎంతోమంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. అయితే, సినిమా వల్ల వాళ్లందరికీ ఒక లెవల్ వరకూ అవకాశాలు వస్తాయి. ఓటీటీ వల్ల చాలామందికి అవకాశాలు వస్తున్నాయి. ఇటువంటి ఫ్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేసిన ‘జీ 5’ వాళ్లకు థాంక్స్. ఈ నెల 19న ‘జీ 5’ ఓటీటీలో ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. అందరూ ఇంట్లో ఫ్యామిలీస్ తో కూర్చుని ఈ ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను” అని చెప్పుకొచ్చారు వరుణ్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Nisha Agarwal: నిషా అగర్వాన్‌ను ఫోన్ నంబర్ అడిగిన్ నెటిజన్.. ఆమె రియాక్షన్ ఇదే..

Liger Movie: అమెరికాలో వాలిపోయిన లైగర్‌ బాయ్స్‌… మైక్‌టైసన్‌తో సన్నివేశాల కోసమేనా.?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. జబర్దస్త్ నుంచి ఔట్!

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే