Balakrishna: బాలయ్యతో వెంకిమామ కామెడీ వేరేలెవల్.. అన్‏స్టాపబుల్ షోలో సందడి చేయనున్న దగ్గుబాటి హీరో ?..

యంగ్ అండ్ టాలెంటెడ్ శర్వానంద్, అడవి శేష్ అన్‏స్టాపబుల్ షోకు విచ్చేయనున్నారు. వీరికి సంబంధించిన ఎపిసోడ్ నవంబర్ 4న స్ట్రీమింగ్ కానుంది. ఇక వీరిద్దరి తర్వాత రాబోయే అతిథి గురించి క్రేజీ అప్డేట్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.

Balakrishna: బాలయ్యతో వెంకిమామ కామెడీ వేరేలెవల్.. అన్‏స్టాపబుల్ షోలో సందడి చేయనున్న దగ్గుబాటి హీరో ?..
Balakrishna, Venkatesh
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 31, 2022 | 12:43 PM

ప్రముఖ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 2 సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. మొదటి ఎపిసోడ్‍లో నారా చంద్రబాబు, నారా లోకేష్ సందడి చేశారు. ఇక వీరిద్దరితో కలిసి బాలయ్య చేసిన అల్లరి వేరేలెవల్. ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయిన నిమిషాల వ్యవధిలోనే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆ తర్వాత సెకండ్ ఎపిసోడ్‏లో యంగ్ హీరోస్ సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్‏లను తనదైన శైలిలో ఓ ఆటాడుకున్నాడు బాలయ్య. కామెడీ టైమింగ్.. పంచులు.. ప్రాసలతో ఎపిసోడ్ లో నవ్వులు పండించాడు. ఇక ఇప్పుడు మరో ఇద్దరు కుర్రహీరోలతో అన్‏స్టాపబుల్ వేదికపై సందడి చేయనున్నారు బాలయ్య. యంగ్ అండ్ టాలెంటెడ్ శర్వానంద్, అడవి శేష్ అన్‏స్టాపబుల్ షోకు విచ్చేయనున్నారు. వీరికి సంబంధించిన ఎపిసోడ్ నవంబర్ 4న స్ట్రీమింగ్ కానుంది. ఇక వీరిద్దరి తర్వాత రాబోయే అతిథి గురించి క్రేజీ అప్డేట్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.

తాజా సమాచారం ప్రకారం అన్‏స్టాపబుల్ షోకు విక్టరీ వెంకటేశ్ రానున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే వెంకిని సంప్రదిస్తున్నారని టాక్ నడుస్తోంది. ఇక వెంకీ.. బాలయ్య ఒక్కచోట చేరి చేసే అల్లరి వేరేలెవల్ ఉండనుందని.. వీరిద్దరికి సంబంధించిచన ఎపిసోడ్ మరింత ఎంటర్టైన్ గా సాగుతుందంటున్నారు. ఇందుకోసం మరోవైపు అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వెంకీతో తన స్టైల్లో పలు ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు బాలయ్య సమాధానాలు రాబట్టబోతున్నాడని.. వెంకటేశ్ నటించిన కొన్ని కామెడీ సన్నివేశాలపై ఆసక్తికర విషయాలు పంచుకోవడమే కాకుండా..వ్యక్తిగత విషయాల గురించి పలు ప్రశ్నలు వేయబోతున్నారని టాక్ నడుస్తోంది. ఇక చూడాలి మరి.. వెంకీమామతో బాలయ్య చేసే సందడి ఎలా ఉండబోతుందో.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!