Nithya Menen: ఒక్కసారి కాదు నాలుగుసార్లు టెస్ట్ చేసిన పాజిటివ్ వచ్చిందంటున్న నిత్యా.. ప్రెగ్నెన్సీ కిట్ నమ్మొచ్చా అంటున్న హీరోయిన్..

రెండు రోజుల క్రితం ప్రెగ్నెన్సీ కిట్‏తో షాకిచ్చిన నిత్యా.. తాజాగా వీడియో షేర్ చేస్తూ కన్య్ఫూజ్ చేసింది. తన తదుపరి సినిమాలో నోరా అనే పాత్రలో నటిస్తున్నట్లుగా హింట్ ఇచ్చేసింది.

Nithya Menen: ఒక్కసారి కాదు నాలుగుసార్లు టెస్ట్ చేసిన పాజిటివ్ వచ్చిందంటున్న నిత్యా.. ప్రెగ్నెన్సీ కిట్ నమ్మొచ్చా అంటున్న హీరోయిన్..
Nithya Menen
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 31, 2022 | 1:37 PM

సోషల్ మీడియా వేదికగా ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ షేర్ చేస్తూ అద్భుతం మొదలైదంటూ హీరోయన్ నిత్యామీనన్ చేసిన పోస్ట్ ఎంత గందరగోళం సృష్టించిందో తెలిసిన విషయమే. ఆకస్మాత్తుగా తన ఇన్ స్టాలో ప్రెగ్నెన్సీ కిట్ షేర్ చేయడంతో అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. పెళ్లి ఎప్పుడూ జరిగింది ? నిజంగానే తల్లికాబోతుందా ? అంటూ అనేక రకాల కామెంట్స్ చేశారు. అయితే మరికొందరు తన తదుపరి సినిమా ప్రమోషన్ కోసం నిత్యా ప్రెగ్నెన్సీ కిట్ షేర్ చేసిందని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక ఇప్పుడు అదే విషయం మరోసారి తెరపైకి వచ్చింది. రెండు రోజుల క్రితం ప్రెగ్నెన్సీ కిట్‏తో షాకిచ్చిన నిత్యా.. తాజాగా వీడియో షేర్ చేస్తూ కన్య్ఫూజ్ చేసింది. తన తదుపరి సినిమాలో నోరా అనే పాత్రలో నటిస్తున్నట్లుగా హింట్ ఇచ్చేసింది. ఆ వీడియోలో ఒక్కసారి కాదు నాలుగు సార్లు టెస్ట్ చేయించుకున్నాను.. అయినా పాజిటివ్ వచ్చింది. ఇదెలా సాధ్యమైందంటూ నిత్యా మాట్లాడింది. అనుకోనేవి ఇలా జరుగుతుంటాయి అంటూ ది వండర్ ఉమెన్ అనే క్యాప్షన్ ఇచ్చింది. దీంతో నిత్యా ది వండర్ ఉమెన్ అనే సిరీస్ చేయనుందని క్లారిటీ వచ్చేసింది. ఈ వెబ్ సిరీస్ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది.

మొత్తానికి తాను ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వార్తలకు ఒక్క వీడియోతో ఫుల్ స్టాప్ పెట్టేసింది ఈముద్దుగుమ్మ. ఇక మరోవైపు.. హీరోయిన్ పార్వతి తిరువోతు సైతం తన ఇన్ స్టా వేదికగా ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసింది. అందులో తన ఫోన్ పట్టుకుని.. ‘హే సిరి.. ప్రెగ్నెన్సీ కిట్స్ ఎంతవరకు నమ్మవచ్చు’ అంటూ అడుగుతుంది. దానికి ఫోన్ లో “ఇది ఏదైతే నమ్ముతున్నారో దానిపై ఆధారపడి ఉంటుంది” అంటూ రిప్లై వచ్చింది. ఇక ఆ తర్వాత ఆమె “ఏయ్ సిరి.. నాకు నేనుగా ఓ బిడ్డను పెంచడం కష్టమా?” అని అడగ్గా.. వెంటనే ఫన్నీ ఆన్సర్ వచ్చింది.

ఇవి కూడా చదవండి

“ఒక పిల్లవాడు 4 సంవత్సరాల వయస్సులోపు నడవగలడు. అయితే కొందరికి ముందుగానే ట్రైనింగ్ ఇవ్వవచ్చు.” అంటూ రిప్లై రాగానే.. విసుగ్గా షట్ అప్ సిరి అని రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన వీడియోస్ నెట్టింట వైరలవుతున్నాయి. మొత్తానికి ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు ప్రెగ్నెన్సీ కిట్స్ షేర్ చేయడం తమ నెక్ట్స్ వెబ్ సిరీస్ ది వండర్ ఉమెన్ ప్రమోషన్ల కోసమే అని చెప్పేశారు.

View this post on Instagram

A post shared by Nithya Menen (@nithyamenen)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!