AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: క్రిస్మస్‌ స్పెషల్‌.. ఈ వారం ఓటీటీలో 30 కు పైగా సినిమాలు, సిరీస్‌లు.. స్ట్రీమింగ్‌ లిస్ట్‌ ఇదే

థియేటర్ల సంగతి అలా ఉంటే ఈ వారం ఓటీటీలో కూడా పెద్ద ఎత్తున సినిమాలు, వెబ్‌ సిరీస్ లు సందడి చేయనున్నాయి. ఇందులో డైరెక్ట్‌ తెలుగు సినిమాలతో పాటు కొన్ని మలయాళ, తమిళ్‌ డబ్బింగ్‌ మూవీస్‌ ఉన్నాయి. ఈ వారం ఆది కేశవ, సప్త సాగరాలు దాటి సైడ్‌ బి వంటి ఆసక్తికర సినిమాలున్నాయి.

OTT Movies: క్రిస్మస్‌ స్పెషల్‌.. ఈ వారం ఓటీటీలో 30 కు పైగా సినిమాలు, సిరీస్‌లు.. స్ట్రీమింగ్‌ లిస్ట్‌ ఇదే
OTT Movies
Basha Shek
|

Updated on: Dec 18, 2023 | 4:41 PM

Share

క్రిస్మస్‌ పండగ సందర్భంగా ఈ వారం థియేటర్లలో రెండు భారీ సినిమాలు రిలీజ్‌ కానున్నాయి. అందులో ప్రభాస్‌ మోస్ట్‌ అవైటెడ్‌ మూవీ సలార్‌ ఒకటి కాగా, మరొకటి షారుఖ్‌ ఖాన్‌ డంకీ మరొకటి. అలాగే హాలీవుడ్ మూవీ ఆక్వామెన్‌ 2 కూడా బరిలోకి దిగనుంది. థియేటర్ల సంగతి అలా ఉంటే ఈ వారం ఓటీటీలో కూడా పెద్ద ఎత్తున సినిమాలు, వెబ్‌ సిరీస్ లు సందడి చేయనున్నాయి. ఇందులో డైరెక్ట్‌ తెలుగు సినిమాలతో పాటు కొన్ని మలయాళ, తమిళ్‌ డబ్బింగ్‌ మూవీస్‌ ఉన్నాయి. ఈ వారం ఆది కేశవ, సప్త సాగరాలు దాటి సైడ్‌ బి వంటి ఆసక్తికర సినిమాలున్నాయి. వీటితో పాటు కొన్ని హిందీ, ఇంగ్లిష్‌ సినిమాలు, సిరీస్ లు కూడా డిజిటల్‌ స్ట్రీమింగ్ కు రానున్నాయి. మరి ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్‌ కు రానున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌లేంటో తెలుసుకుందాం రండి.

నెట్‌ఫ్లిక్స్ సినిమాలు, సిరీస్‌ లివే..

  • హలో ఘోస్ట్ (మాండరిన్ సినిమా) – డిసెంబరు 18
  • ద రోప్ కర్స్ 3 (మాండరిన్ మూవీ) – డిసెంబరు 18
  • సిండీ లా రెజీనా: ద హై స్కూల్ ఇయర్స్ (స్పానిష్ వెబ్ సిరీస్) – డిసెంబరు 20
  • మ్యాస్ట్రో (ఇంగ్లిష్ సినిమా) – డిసెంబరు 20
  • లైక్ ఫ్లవర్స్ ఇన్ సాండ్ (కొరియన్ వెబ్‌ సిరీస్) – డిసెంబరు 21
  • రెబల్ మూన్ పార్ట్ 1: ఏ చైల్డ్ ఆఫ్ ఫైర్ (ఇంగ్లిష్‌ మూవీ) – డిసెంబరు 21
  • ఆదికేశవ (తెలుగు సినిమా) – డిసెంబరు 22
  • కర్రీ & సైనైడ్: ద జాలీ జోసెఫ్ కేస్ (హిందీ వెబ్‌ సిరీస్) – డిసెంబరు 22
  • యోంగ్‌సాంగ్ క్రియేచర్ (కొరియన్ వెబ్ సిరీస్) – డిసెంబరు 22
  • కుయికో (తమిళ సినిమా) – డిసెంబరు 22
  • ఏ వ్యాంపైర్ ఇన్ ద ఫ్యామిలీ (పోర్చుగీస్ మూవీ) – డిసెంబరు 24
  • పింక్ ఫాంగ్ సింగ్-అలాంగ్ మూవీ 3: క్యాచ్ ద జింజర్ బ్రెడ్ మ్యాన్ (ఇంగ్లిష్ సినిమా) – డిసెంబరు 24

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

  • ఫలిమి (తెలుగు డబ్బింగ్ సినిమా) – డిసెంబరు 18
  • BTS మాన్యుమెంట్స్: బియాండ్ ద స్టార్ (కొరియన్ వెబ్‌ సిరీస్) – డిసెంబరు 20
  • డ్రాగన్స్ ఆఫ్ వాండర్ హ్యాచ్ (జపనీస్ వెబ్‌ సిరీస్) – డిసెంబరు 20
  • పెర్సీ జాక్సన్ అండ్ ఒలింపియన్స్ (ఇంగ్లిష్ వెబ్‌ సిరీస్) – డిసెంబరు 20
  • వాట్ ఇఫ్..?: సీజన్ 2 (ఇంగ్లిష్ వెబ్‌ సిరీస్) – డిసెంబరు 22

అమెజాన్ ప్రైమ్ వీడియో

  • మిషన్ స్టార్ట్ Ab (హిందీ వెబ్‌ సిరీస్) – డిసెంబరు 19
  • డ్రై డే (హిందీ మూవీ) – డిసెంబరు 22
  • సాల్ట్ బర్న్ (ఇంగ్లిష్ సినిమా) – డిసెంబరు 22
  • సప్త సాగరాలు దాటి సైడ్-బి (తెలుగు డబ్బింగ్ సినిమా) – డిసెంబరు 22

జియో సినిమా

  • బార్బీ (ఇంగ్లిష్ సినిమా) – డిసెంబరు 21
  • హే కమీని (హిందీ సినిమా) – డిసెంబరు 22

జీ5

  • అడి (మలయాళ సినిమా) – డిసెంబరు 22
  • హోమోరస్లీ యూవర్స్: సీజన్ 3 (హిందీ వెబ్‌ సిరీస్) – డిసెంబరు 22

బుక్ మై షో

  • ద మిరాకిల్ క్లబ్ (ఇంగ్లిష్ సినిమా) – డిసెంబరు 19
  • లయన్స్ గేట్ ప్లే
  • ఫియర్ ద నైట్ (ఇంగ్లిష్ మూవీ) – డిసెంబరు 22

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.