
సరికొత్త కంటెంట్.. సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూడాలనుకుంటున్నారా.. ? అయితే మీకు ఈ సినిమా సరైన ఎంపిక. మొదటి నుంచి ప్రేక్షకులను ఆకట్టుకుంటుూ ప్రతిక్షణం సస్పెన్స్ క్రియేట్ చేస్తూ జనాలను థ్రిల్ చేయడమే కాకుండా.. IMDb రేటింగ్‌లో కాంతార చిత్రాన్ని అధిగమించింది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా ఓటీటీలో దుమ్మురేపుతుంది. ఆ మూవీ పేరు వడ చెన్నై. IMDbలో కాంతారా 8.2 రేటింగ్‌ను పొందగా, వడ చెన్నై 8.4 రేటింగ్‌ను పొందింది. 2018 లో విడుదలైన ఈ తమిళ చిత్రం అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. అన్ని విభాగాల్లోనూ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. వడ చెన్నై కథ ఒక ప్రతిభావంతులైన క్యారమ్ ఆటగాడి చుట్టూ తిరుగుతుంది. పరిస్థితుల కారణంగా నేర ప్రపంచంలోకి వెళ్లిన అతడి జీవితం ఏ మలుపులు తిరిగింది అనేది సినిమా.
ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..
స్థానిక మాఫియా ముఠాలో చేరిన అతడు.. తన సొంత ప్రాంతాన్ని నాశనం చేయడానికి కుట్ర జరుగుతుందని తెలుసుకుని.. ఆ ప్రమాదం నుంచి తన ప్రాంతాన్ని ఎలా కాపాడుకున్నాడు..?అసలు అతడు మాఫియాతో ఎందుకు చేతులు కలపాల్సి వచ్చింది? ఆ తర్వాత జరిగిన పరిస్థితులు ఏంటీ అనేద సినిమా. ఆద్యంతం ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి వెట్రిమారన్ దర్శకత్వం వహించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించడంలో అతడు దిట్ట. ఇందులో కోలీవుడ్ హీరో ధనుష్, ఐశ్వర్య రాజేశ్, డేనియల్ బాలాజీ, ఆండ్రియా జెరెమియా ముఖ్య పాత్రలు పోషించారు. వీరందరి అద్భుతమైన నటన మిమ్మల్ని కట్టిపడేస్తుంది.
ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?
చెన్నై స్థానిక సంస్కృతి, రాజకీయాలు, గ్యాంగ్ వార్‌లను ఈ చిత్రం చూపిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ప్రతి వారం సస్పెన్స్, థ్రిల్ ఉండే చిత్రాల కోసం ఎదురుచూస్తున్నవారికి ఈ మూవీ బెస్ట్ ఆప్షన్.
ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..