AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jai Bhim Trailer : “పోరాడటానికి లా అనేది నాకు ఓ వెపన్ మాత్రమే”.. ఆకట్టుకుంటున్న ‘జై భీమ్’ ట్రైలర్..

తమిళ్‌‌‌తోపాటు తెలుగులోనూ మంచి క్రేజ్ సొంతం చేసుకున్న హీరో సూర్య. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు సూర్య

Jai Bhim Trailer : పోరాడటానికి లా అనేది నాకు ఓ వెపన్ మాత్రమే.. ఆకట్టుకుంటున్న 'జై భీమ్' ట్రైలర్..
IMDBలో ఏకంగా 9.8 రేటింగ్‌ను సాధించి ఒక్క‌సారి దేశం దృష్టిని ఆక‌ర్షించిందీ చిత్రం. త‌మిళ‌నాడులో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న న‌టుడు సూర్య త‌న ఇమేజ్‌ను పూర్తిగా ప‌క్క‌న పెట్టి ఈ పాత్ర‌కు వంద శాతం న్యాయం చేశారు.
Rajeev Rayala
| Edited By: |

Updated on: Oct 22, 2021 | 7:46 PM

Share

Jai Bhim: తమిళ్‌‌‌తోపాటు తెలుగులోనూ మంచి క్రేజ్ సొంతం చేసుకున్న హీరో సూర్య. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు సూర్య. ఇటీవలే ఆకాశం నీ హద్దు రా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు ఈ టాలెంటెడ్ హీరో. సుధ కొంగరు దర్శకత్వంలో సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. కరోనా కారణంగా ఈ సినిమా థియేటర్స్ లో విడుదలకాలేకపోయింది. ప్రముఖ ఓటీటీ వేదికగా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు జై భీమ్ అనే సినిమాతో రాబోతున్నాడు సూర్య. టీ జే జ్ఞాన్వెల్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు తెలుగులో జై భీమ్ అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుగా తీసుకురానున్నారు. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇటీవలే విడుదలైన ఏ ఈసినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.  ఈ మూవీలో సూర్య లాయర్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా ఆదివాసుల కోసం పోరాడే లాయర్ కథ అని అర్ధమవుతోంది. ఈ సినిమాను తెలుగు, తమిళ్,మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.తాజాగా ఈ సినిమానుంచి ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో ఆదివాసులకోసం ఓ లాయర్ చేసిన పోరాటాన్ని చూపించారు. ఇక ఈ సినిమా ఓ రియల్ హీరో కథ అని తెలుస్తుంది. 1993 లో తమిళనాడులో గిరిజన మహిళ తరపున న్యాయం కోసం సీనియర్ అడ్వకేట్ చంద్రు పోరాటం చేశారు. ఇప్పుడు ఇదే కథాంశం తో సినిమా తెరకెక్కుతోందని తెలుస్తుంది. అప్పట్లో ఆ మహిళ కోసం చంద్రు చేసిన పోరాటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ఈ సినిమా సూర్య కెరీర్ లో బెస్ట్ సినిమాగా నిలుస్తుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు సూర్య అభిమానులు. ఈ ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఈ ఫోటోలోని చిన్నారి అబ్బాయిలకు డ్రీమ్ గర్ల్.. ఎన్నో బ్లాక్‌బస్టర్స్ అందుకుంది.. ఎవరో తెలుసా.!

Nandamuri Balakrishna : ‘నాట్యం’ పై ప్రసంశలు కురిపించిన నటసింహం.. ఇది సినిమా కాదు అంటూ..

Maa Elections 2021: నాకు ఎటువంటి సంబంధం లేదు.. నాకు ఏ లెటర్ రాలేదు.. క్లారిటీ ఇచ్చిన ఎన్నికల అధికారి..

JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు