AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gorre Puranam OTT: అప్పుడే ఓటీటీలోకి సుహాస్ సినిమా.. ‘గొర్రె పురాణం’ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటున్నాడు హీరో సుహాస్. ఈ కోవలోనే అతను నటించిన తాజా చిత్రం ‘గొర్రె పురాణం’. బాబీ తెరకెక్కించిన ఈ డిఫరెంట్ మూవీలో పోసాని కృష్ణ మురళి, రఘు ప్రధాన పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 20న విడుదలైన గొర్రె పురాణం సినిమా డీసెంట్ టాక్ తెచ్చుకుంది.

Gorre Puranam OTT: అప్పుడే ఓటీటీలోకి సుహాస్ సినిమా.. 'గొర్రె పురాణం' స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Gorre Puranam Movie
Basha Shek
|

Updated on: Oct 05, 2024 | 11:55 AM

Share

వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటున్నాడు హీరో సుహాస్. ఈ కోవలోనే అతను నటించిన తాజా చిత్రం ‘గొర్రె పురాణం’. బాబీ తెరకెక్కించిన ఈ డిఫరెంట్ మూవీలో పోసాని కృష్ణ మురళి, రఘు ప్రధాన పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 20న విడుదలైన గొర్రె పురాణం సినిమా డీసెంట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు విజయం సాధించింది. అయితే వారం రోజుల వ్యవధిలోనే ఎన్టీఆర్ దేవర రిలీజ్ కావడంతో ఈ సినిమా థియేటర్లలో ఎక్కువ రోజులు ఆడలేకపోయింది. అయితే ఇప్పుడీ గొర్రె పురాణం ఓటీటీలోకి వస్తోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై అప్డేట్ వచ్చింది. త్వరలోనే ఈ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు ఆహా అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా గొర్రె పురాణం సినిమా పోస్టర్ ను విడుదల చేసింది. అయితే, ఎప్పుడు స్ట్రీమింగ్‌కు తీసుకొస్తారనేది మాత్రం వెళ్లడించలేదు. అక్టోబర్‌ 6న ఓటీటీలోకి రావచ్చని ప్రచారం జరుగుతోంది. లేదంటే, అక్టోబర్‌ 11న తప్పకుండా ఓటీటీలో రిలీజ్‌ అవుతుందని టాక్.

ఫోకల్ వెంచర్స్ బ్యానర్ పై ప్రవీణ్‌రెడ్డి గొర్రె పురాణం సినిమాను నిర్మించారు. పవన్ సి.హెచ్ స్వరాలు సమకూర్చారు. గొర్రె పురాణం టైటిల్‌ కు తగ్గట్టే ఈ సినిమా కథంతా ఓ గొర్రె చుట్టూ తిరుగుతుంది. ఒక గొర్రె రెండు మతాల మధ్య ఎలా నలిగిపోయిందో సినిమాలో చక్కగా చూపించారు మేకర్స్. ఓ ముస్లిం వ్యక్తి ఇంట్లో బక్రీద్‌ పండుగకు రావాల్సిన గొర్రె అక్కడి నుంచి తప్పించుకుని ఓ గుడిలోకి వెళ్లింది. దీంతో హిందువులు గొర్రెలు తమదని, తామే బలిస్తామని గొడవకు దిగుతారు. మరి ఈ గొర్రె కోసం రెండు వర్గాల మధ్య గొడవలు ఎక్కడికి దారితీశాయి? చివరికి ఏమైంది అన్నది తెలుసుకోవాలంటే సుహాస్ గొర్రె పురాణం చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

ఆహాలో స్ట్రీమింగ్..

గొర్రె పురాణం సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.