Director Krish: ఓటీటీలోకి అడుగుపెట్టనున్న స్టార్ డైరెక్టర్.. ఆ సంస్థ కోసం ప్రసిద్ద నాటకాన్ని వెబ్ సిరీస్‌గా తీయనున్న క్రిష్..
ప్రస్తుతం ఓటీటీ హాహ పెరిగిపోయింది. ఓవైపు థియేటర్లలో భారీ చిత్రాలు విడుదలై సూపర హిట్ అవుతున్న ఓటీటీలకు మాత్రం ఆదరణ

ప్రస్తుతం ఓటీటీ హాహ పెరిగిపోయింది. ఓవైపు థియేటర్లలో భారీ చిత్రాలు విడుదలై సూపర హిట్ అవుతున్న ఓటీటీలకు మాత్రం ఆదరణ తగ్గడం లేదు. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్.. సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి ఓటీటీ సంస్థలు. నువ్వా నేనా అంటూ ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందిస్తూ డిజిటల్ ప్లాట్ ఫాంలో సత్తా చూపిస్తున్నాయి. ఇక ఓటీటీవైపు స్టార్ హీరోహీరోయిన్స్ సైతం ఆసక్తి చూపిస్తున్నారు. వెబ్ సిరీస్ చేస్తూ హిట్ అందుకుంటున్నారు. ఇప్పటికే పలువురు స్టార్ హీరోయిన్స్ ఓటీటీలో వెబ్ సిరీస్ చేసి తమ సత్తా చాటుకున్నారు. ఇక ఇటీవల టాప్ డైరెక్టర్స్ సైతం ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నారు. తాజాగా స్టార్ డైరెక్టర్ క్రిష్ సైతం ఓటీటీలో వెబ్ సిరీస్ చేయనున్నట్లుగా సమాచారం.
ఇటీవల కొండపొలం నవలను సినిమాగా తెరకెక్కించి హిట్ అందుకున్నారు క్రిష్. నల్లమల్ల అడవులకు దగ్గరగా ఉండే గ్రామాల్లోని గొర్రెల కాపరుల జీవితం గురించి కొండపొలం సినిమా ద్వారా చూపించారు క్రిష్. ఇందులో మెగా హీరో వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించి మెప్పించారు. తాజాగా క్రిష్ దృష్టి గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కం పై పడింది. తెలుగు సాహిత్య చరిత్రలో ఈ నాటకానికి ప్రత్యేక స్థానముంది. ఈ నాటకాన్ని ఇప్పుడు వెబ్ సిరీస్‌గా తెరకెక్కించబోతున్నారట. ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ కోసం క్రిష్ ఈ వెబ్ సిరీస్ రూపొందించనున్నట్లుగా సమాచారం. రచన, దర్శకత్వ పర్యవేక్షణ మొత్తం క్రిష్ చూసుకోనున్నారని.. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ సైతం పూర్తైనట్టు టాక్. కన్యాశుల్కంలో గిరీశం, మధురవాణి, అగ్నిహోత్రావధానులు, రామప్ప పంతులు, బుచ్చెమ్మ, లుబ్దావధానులు, కరకట శాస్త్రి తదితర పాత్రలు ఇందులో చాలా ప్రసిద్ధం. గతంలో ఈ నాటకం సినిమాగా వచ్చింది. ఈ ‘కన్యాశుల్కం’ లో యన్టీఆర్ గిరీశంగానూ, సావిత్రి మధురవాణిగానూ నటించి ప్రేక్షకులను అలరించారు. ఇక ఈ వెబ్ సిరీస్ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: RRR Pre Release Event: చెన్నైలో RRR ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ వీడియో
Salman Khan: కరిచిన పాము కూడా నా ఫ్రెండే.. పాము ఎలా కాటేసిందో వెల్లడించిన సల్లూ భాయ్..
RRR Movie: సినిమాకే హైలైట్‌గా రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్.. 2 వేల మంది జూనియర్ ఆర్టిస్ట్‌లతో..
Akhil Akkineni: అయ్యగారూ.. కింగ్ అంతే.. కండలు తిరిగిన దేహంతో అఖిల్.. ఫిదా అవుతోన్న ఫ్యాన్స్..
Balakrishna: యాదాద్రి పునర్నిర్మాణంలో కేసీఆర్ చొరవ ప్రశంసనీయం.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు
