అదిరిపోయిన అర్థమైందా అరుణ్ కుమార్ టీజర్.. సీజన్ 2 స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే
ఆహా OTT గురువారం తన ఒరిజినల్ వెబ్ సిరీస్ అర్థమైంద అరుణ్ కుమార్ సీజన్ 2 టీజర్‌ను విడుదల చేసింది. ఇప్పటికే విడుదలైన మొదటి సీజన్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు సీజన్ 2 ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది.
ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా విభిన్నమైన వెబ్ సిరీస్ లను, సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందిస్తుంది. ఇప్పటికే ఆహా ఓటీటీలో చాలా రకాల సిరీస్ లు, సినిమాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఆసక్తికర గేమ్ షోలు, ఆకట్టుకునే టాక్ షోలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ సీజన్ 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆహా OTT గురువారం తన ఒరిజినల్ వెబ్ సిరీస్ అర్థమైందా అరుణ్ కుమార్ సీజన్ 2 టీజర్‌ను విడుదల చేసింది. ఇప్పటికే విడుదలైన మొదటి సీజన్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు సీజన్ 2 ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఇది అక్టోబర్ 31, 2024న ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.
ఇది కూడా చదవండి : Unstoppable with NBK: బాలయ్య షోకి హాజరుకానున్న స్టార్ హీరోయిన్.. అభిమానులు ఫుల్ ఖుష్
కార్పోరేట్ లైఫ్ లో చిక్కుకున్న ఓ అమాయకుడు కథ ఇది. ఇప్పటికే మొదటి సీజన్ 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను సాధించింది. ఇక ఇప్పుడు కొత్త సీజన్ కొత్త పురుష ప్రధాన పాత్రతో ఉండనుందని టీజర్ చూస్తే అర్ధమవుతుంది. గతంలో నటుడు హర్షిత్ రెడ్డి పోషించిన అరుణ్ కుమార్ పాత్రను ఇప్పుడు సిద్ధూ పవన్ పోషిస్తున్నాడు. అర్థమైందా అరుణ్ కుమార్ సీజన్ 2 లో కొత్త పాత్రలను పరిచయం చేస్తున్నారు. ఈ సిరీస్ లో సోనియా, సిరి కూడా నటిస్తున్నారు.
ఇది కూడా చదవండి : Puri Jagannadh: అమ్మబాబోయ్..! పూరీజన్నాథ్ కూతురు ఎంతలా మారిపోయిందో.!
తేజస్విని మాదివాడ, అనన్య హీరోయిన్స్ గా నటిస్తుంది. అర్రే స్టూడియో, లాఫింగ్ కౌ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న అర్థమైందా అరుణ్ కుమార్ సీజన్ 2 కోసం అభిమానులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అర్థమైందా అరుణ్ కుమార్ సీజన్ 2లో కొత్త డ్రామా, ట్విస్ట్‌లు, వినోదాన్ని తెలుసుకోవడానికి అక్టోబర్ 31, 2024న ప్రీమియర్‌ని మిస్ అవ్వకండి. ఇక ఈ సీజన్ 2టీజర్ పై మీరూ ఓ లుక్కేయండి.
ఇది కూడా చదవండి : Parvati Melton: పాపా.. పార్వతి ఇది నువ్వేనా..!! ఝలక్ ఇచ్చిన జల్సా బ్యూటీ
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.