Soniya Akula: బిగ్ బాస్ బ్యూటీ సోనియా పెళ్లి ముహూర్తం ఫిక్స్.. వరుడు ఎవరో తెలుసా?

సినిమాలు, బిగ్ బాస్ రియాల్టీ షో, టీవీ షోస్, సంగతి పక్కన పెడతే.. సోనియాను ఓ విషయంలో మాత్రం బాగా మెచ్చుకోవచ్చు. అదేంటంటే.. ఆమె ఓ ఎన్జీవో నిర్వహిస్తోంది. దీని ద్వారా ఎంతో మంది పేద పిల్లలకు సహాయం చేస్తోంది. ఇందుకు ఆమెకు కాబోయే భర్త కూడా సహకరిస్తున్నాడు.

Soniya Akula: బిగ్ బాస్ బ్యూటీ సోనియా పెళ్లి ముహూర్తం ఫిక్స్.. వరుడు ఎవరో తెలుసా?
Soniya Akula
Follow us
Basha Shek

|

Updated on: Oct 17, 2024 | 5:14 PM

బిగ్‌బాస్‌ తెలుగు ఎనిమిదో సీజన్‌ తో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది సోనియా ఆకుల. అంతకు ముందు డైరెక్టర్ ఆర్జీవీ తెరకెక్కించిన కొన్ని సినిమాల్లో ఆమె నటించినా పెద్ద గుర్తింపు రాలేదు. అయితే బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టాక మాత్రం సోనియా పేరు నెట్టింట మార్మోగిపోయింది. అందుకు తగ్గట్టుగానే షో ప్రారంభంలో తన ఆట, మాట తీరుతో బిగ్ బాస్ ఆడియెన్స్ మనసులు గెల్చుకుంది సోనియా. ఓటింగ్ లోనూ ఆధిక్యం ప్రదర్శించింది. అయితే పోనూ పోనూ సోనియా ఆటతీరు పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా నిఖిల్, పృథ్వీల విషయంలో ఆమె ప్రవర్తించిన తీరు చాలా మందిని హర్ట్ చేసింది. ఫలితంగా చివరి వరకు హౌస్ లో ఉంటుందనుకున్న సోనియా ఆకు నాలుగో వారంలోనే బయటకు వచ్చేసింది. తక్కువ ఓట్లు పడడంతో ఎవరూ ఊహించని విధంగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. అయితే ఎలిమినేట్ తర్వాత కూడా సోనియా పేరు బాగా వినిపిస్తోంది. పలు ఇంటర్వ్యూల్లో ఆమె చేస్తోన్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. వీటి సంగతి పక్కన పెడితే. . సోనియా ఆకుల  త్వరలోనే పెళ్లిపీటలెక్కనుంది. తన బాయ్ ఫ్రెండ్ యష్ వీరగోనితో కలిసి మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టనుంది. ఈ విషయాన్ని ఆమెనే బిగ్ బాస్ హౌస్ లో చెప్పుకొచ్చిది.

సోనియాకు కాబోయే భర్త యష్ విషయానికి వస్తే.. అతనికి స్వయంగా ఫ్లై హై అనే టూరిజం సంస్థ ఉంది. అలాగే అబ్రాడ్ కి వెళ్లే స్టూడెంట్స్ కోసం పనిచేసే కన్సల్టెన్సీ సంస్థ ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన యష్ సోనియాతో ప్రేమ, పెళ్లి గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

ఇవి కూడా చదవండి

కాబోయే భర్తతో సోనియా..

‘సోనియా నేను రెండు, మూడేళ్ళుగా కలిసి పనిచేస్తున్నాం. మా పరిచయం స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది. మా వివాహానికి ఇంట్లో పెద్దలు కూడా ఒప్పుకున్నారు. బిగ్ బాస్ కి వెళ్లేముందే వివాహం చేసుకోవాలని భావించాం. అయితే బిగ్ బాస్ ఛాన్స్ వదులుకోకూడదని సోనియా వెళ్లింది. డిసెంబర్ లో పెళ్లి చేసుకోబోతున్నాం’ అని యష్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. బిగ్ బాస్ అభిమానులు, నెటిజన్లు సోనియా, యష్ లకు ముందుగానే శుభాకాంక్షలు, అభినందనలు చెబుతున్నారు.

బాయ్ ఫ్రెండ్ యష్ తో బిగ్ బాస్ బ్యూటీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి