AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unstoppable with NBK: బాలయ్య షోకి హాజరుకానున్న స్టార్ హీరోయిన్.. అభిమానులు ఫుల్ ఖుష్

బాలయ్య తాజాగా తన కొత్త సినిమాను కూడా అనౌన్స్ చేశారు. బాలకృష్ణ , బోయపాటి కాంబినేషన్ లో అఖండ 2 సినిమా రానుంది. ఇదిలా ఉంటే ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు టాక్ షోకు హోస్ట్ గానూ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు బాలకృష్ణ.

Unstoppable with NBK: బాలయ్య షోకి హాజరుకానున్న స్టార్ హీరోయిన్.. అభిమానులు ఫుల్ ఖుష్
Balakrishna
Rajeev Rayala
|

Updated on: Oct 16, 2024 | 8:37 PM

Share

నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్న బాలయ్య తాజాగా తన కొత్త సినిమాను కూడా అనౌన్స్ చేశారు. బాలకృష్ణ , బోయపాటి కాంబినేషన్ లో అఖండ 2 సినిమా రానుంది. ఇదిలా ఉంటే ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు టాక్ షోకు హోస్ట్ గానూ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు బాలకృష్ణ. బాలయ్య హోస్ట్ గా అన్ స్టాపబుల్ షో ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికే ఈ షో విజయవంతంగా మూడు సీజన్స్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు నాలుగో సీజన్ కు సిద్ధం అవుతుంది. ఆహా, OTTలో ప్రసారమయ్యే ఈ షో దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచింది. ఇప్పటికే ఈ షోకు చాలా మంది హాజరయ్యారు. తెలుగు సినీ పరిశ్రమలోని టాప్ స్టార్స్ కూడా బాలయ్య పిలిస్తే ఈ షోకి వస్తారు.

ఇది కూడా చదవండి : వాయమ్మో..! చెట్టెక్కిన చింతామణి.. ఈ టాలీవుడ్ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.?

బాలయ్య సినీ సెలబ్రెటీలు తికమక పెట్టే ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టి అతిథులను డైలమాలో పడేస్తున్నారు. గత సీజన్‌లో ఈ షోకి బాలీవుడ్ స్టార్స్ కూడా హాజరయ్యారు. పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడు, మహేష్ బాబు, అల్లు అర్జున్, నిర్మాత సురేష్, కీరవాణి, బ్రహ్మానందం, విజయ్ దేవరకొండ ఇంకా చాలా మంది టాప్ స్టార్స్ వచ్చారు. ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు పెద్దగా బయట షోలకు హాజరు అవ్వరు. కానీ బాలయ్య షోకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఇది కూడా చదవండి :Chatrapathi: సూరీడు.. ఓ సూరీడూ.. ఇంతలా మారిపోయావేందయ్యా..!

బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ కూడా ఈ షోకు హాజరయ్యాడు. ఇక అన్ స్టాపబుల్ సీజన్ 4 త్వరలోనే ప్రారంభం కానుంది. ఆహా OTT ఇప్పటికే మొదటి ప్రోమోను విడుదల చేసింది. అయితే ఈ సీజన్‌కు మెగాస్టార్ చిరంజీవి మొదటి అతిథిగా రానున్నారని అంటున్నారు. చిరంజీవి, బాలయ్య మధ్య దశాబ్దాలుగా పోటీ ఉన్నప్పటికీ, ఇద్దరూ మంచి స్నేహితులు, కాబట్టి బాలయ్య తన స్నేహితుడిని ఈ సీజన్‌కు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. అంతేకాదు ఈసారి ‘పుష్ప 2’ విడుదల కూడా ఉన్నందున అల్లు అర్జున్, సుకుమార్ కూడా రావొచ్చని తెలుస్తోంది. అదేవిధంగా సమంత కూడా వచ్చే అవకాశం ఉంది. సమంత ఇంతవరకు ఈ షోకు హాజరు కాలేదు కాబట్టి ఆమెను ఈసారి తీసుకురానున్నారని టాక్. అలాగే యంగ్ బ్యూటీ శ్రీలీల కూడా వస్తుందని టాక్. మరో విశేషమేమిటంటే హీరోగా మారబోతున్న బాలయ్య తనయుడు మోక్షజ్ఞ కూడా వస్తాడనే టాక్ వినిపిస్తోంది. ఈ షోకి మరికొందరు బాలీవుడ్ స్టార్స్ కూడా రాబోతున్నారని అంటున్నారు.

ఇది కూడా చదవండి :Tollywood : ఎలాంటి పాత్రకైనా రెడీ.. ఓపెన్‌గా చెప్పేసిన హాట్ బ్యూటీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో పెద్దపులి స్విమ్మింగ్
శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో పెద్దపులి స్విమ్మింగ్
లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో