Telusu Kada OTT: అఫీషియల్.. ఓటీటీలో సిద్దు జొన్నలగడ్డ రొమాంటిక్ మూవీ.. ‘తెలుసుకదా’ స్ట్రీమింగ్ వివరాలివే
జాక్ పరాజయం తర్వాత సిద్దు జొన్నలగడ్డ నటించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ తెలుసు కదా. నీరజా కోన తెరకెక్కించిన ఈ మూవీలో రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. గత నెలలో విడుదలైన ఈ చిత్రం యూత్ ను బాగా ఆకట్టుకుంది.

టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ సినిమా. లేడీ డైరెక్టర్ నీరజా కోన తెరకెక్కించిన ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి కథానాయికలుగా నటించారు. అక్టోబర్ 17న విడుదలైన తెలుసు కదా సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. కానీ ఈ సినిమాలో యూత్ ను మెప్పించే అంశాలు చాలా ఉన్నాయి. అలాగే సిద్దు నటన, హీరోయిన్ల అంద చందాలు, పాటలు, వైవా హర్ష కామెడీ సినిమాలో హైలెట్ గా నిలిచాయి. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన తెలుసు కదా సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇందుకోసం చిత్ర నిర్మాతలకు భారీ మొత్తం చెల్లించినట్లు సమాచారం. థియేట్రికల్ వెర్షన్ ముగియడంతో తెలుసు కదా స్ట్రీమింగ్ డేట్ పై అధికారిక ప్రకటన వెలువడింది. నవంబర్ 14 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు తన అప్ కమింగ్ సినిమాల జాబితాలో తెలుసు కదా ఉందని నెట్‌ఫ్లిక్స్ పేర్కొంది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్, కృతిప్రసాద్ సంయుక్తంగా తెలుసు కదా సినిమాను నిర్మించారు. రోహిణీ, సంజయ్ స్వరూప్, రాజశ్రీ, అన్న పూర్ణ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. తమన్ అందించిన పాటలు ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి . ముఖ్యంగా మల్లిక గంధ పాట యూట్యూబ్ లో ఛార్ట్ బస్టర్ గా నిలిచింది.
సినిమా కథేంటంటే..
తెలుసు కదా సినిమా కథ విషయానికి వస్తే. వరుణ్ అలియాస్ సిద్దు జొన్నలగడ్డ ఒక రెస్టారెంట్ నడుపుతూ ఉంటాడు. అనాధ కావడంతో తనకంటూ ప్రత్యేకంగా ఒక ఫ్యామిలీ కావాలని.. పెళ్లి చేసుకుని సెటిల్ కావాలని ఆశపడతాడు. అయితే తన లైఫ్ లో అంతకుముందే రాగా అలియాస్ శ్రీనిధి శెట్టి తో బ్రేకప్ అయి ఉంటుంది. అలాంటి సమయంలో అంజలి అలియాస్ రాశి ఖన్నా పరిచయమవుతుంది. ఆమెతో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుంటాడు. కానీ అనుకోని విధంగా మళ్లీ వరుణ్ జీవితంలోకి వస్తుంది రాగ. ఆ తర్వాత ఏం జరిగింది.. ముగ్గురు జీవితాలు ఎటువైపు తిరిగాయి? అన్నది తెలుసుకోవాలంటే ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ చూడాల్సిందే.
నవంబర్ 14 నుంచి నెట్ ఫ్లిక్స్ లో..
#TelusuKada (Telugu) streaming from November 14 on Netflix 🍿!!#OTT_Trackers pic.twitter.com/eReGxDOMid
— OTT Trackers (@OTT_Trackers) November 9, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








