AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టార్ హీరోలు లేరు.. స్పెషల్ సాంగ్స్ లేవు.. దేశంలోనే దుమ్మురేపిన వెబ్ సిరీస్..

ప్రస్తుతం ఓటీటీలో ఓ సినిమా అరాచకం సృష్టిస్తుంది. ముఖ్యంగా కొన్నాళ్లుగా నెట్టింట రొమాంటిక్ లవ్ స్టోరీస్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ చూసేందుకు అడియన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ వెబ్ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆక్టటుకుంటుంది .

స్టార్ హీరోలు లేరు.. స్పెషల్ సాంగ్స్ లేవు.. దేశంలోనే దుమ్మురేపిన వెబ్ సిరీస్..
Ott Movie
Rajeev Rayala
|

Updated on: Nov 09, 2025 | 8:27 AM

Share

ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రేక్షకులకు ప్రతిరోజు పండగలా మారింది. కొత్త కొత్త సినిమాలు, రకరకాల భాషల్లో అందుబాటులో ఉన్నాయి. అలాగే తెలుగులో డబ్ అవుతున్న సినిమాలు కూడా పదుల సంఖ్యలో ఉన్నాయి. ఓటీటీలో సూపర్ హిట్ సినిమాలతో పాటు అదిరిపోయే వెబ్ సిరీస్ లు కూడా ప్రేక్షకులను అలరిస్తున్నాయి. థియేటర్స్ లో విడుదలైన సినిమాలు నెల రోజులకు ఓటీటీల్లో విడుదలై పేక్షకులను అలరిస్తున్నాయి. ఇక సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తుంటే.. వెబ్ సిరీస్ లు కూడా ఓటీటీల్లో అదరగొడుతున్నాయి. ఓటీటీలో ఇప్పటికే చాలా వెబ్ సిరీస్ లు ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. స్టార్ హీరోలు కూడా వెబ్ సిరీస్ ల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునే వెబ్ సిరీస్ మాత్రం చాలా డిఫరెంట్..

బాలయ్యకు లవర్‌గా, తల్లిగా నటించిన యంగ్ హీరోయిన్ ఎవరో తెలుసా.?

ఇండియాలోనే ఎక్కువ మంది చూసిన సిరీస్ ఇది. ఈ వెబ్ సిరీస్ లో పెద్ద పెద్ద స్టార్స్ లేరు.. కానీ ఓటీటీలో టాప్ లో ఉంది ఈ సిరీస్. ఇంతకూ అది ఏంటంటే.. ఈ వెబ్ సిరీస్ ఓ కోర్టు డ్రామా.. ఎపిసోడ్ ఎపిసోడ్ కు ఊహించని ట్విస్ట్ లు ప్రేక్షకులు సీట్ ఎడ్జ్ పై కూర్చోబెడతాయి. 2025లో ఇండియాలో ఎక్కువ పేక్షకులు చూసిన సిరీస్ గా నయా రికార్డ్ క్రియేట్ చేసింది ఈ సినిమా. ఈ వెబ్ సిరీస్ ఏకంగా 27.7 మిలియన్ల యూనిక్‌ యూజర్లతో టాప్ ప్లేస్ లో చోటు సంపాదించుకుంది. ఇంతకూ ఈ వెబ్ సిరీస్ ఎదో కాదు.

7/జీ బృందావన్‌ కాలనీ సీక్వెల్‌లో హీరోయిన్ ఈమేనా..! అందం అదిరిపోయిందిగా..

బాలీవుడ్ లో తెరకెక్కిన క్రిమినల్ జస్టిస్: ఎ ఫ్యామిలీ మ్యాటర్. ఈ సిరీస్ లో పంకజ్ త్రిపాఠీ ప్రధాన పాత్రలో నటించారు. ఓర్మాక్స్ మీడియా టాప్ 50 స్ట్రీమింగ్ ఒరిజినల్స్ లిస్ట్ లో క్రిమినల్ జస్టిస్ టాప్ లో ఉంది. ఈ కోర్టు డ్రామా 27.7 మిలియన్ల యూనిక్‌ యూజర్లను ఆకట్టుకుంది. ఈ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికీ ఈ వెబ్ సిరీస్ ను ప్రేక్షకులు ఆసక్తిగా వీక్షిస్తున్నారు. తెలుగులోనూ ఈ సిరీస్ అందుబాటులో ఉంది. ఈ సిరీస్ తర్వాత పంచాయత్ సీజన్ 4’ 23.8 మిలియన్ల యూజర్లతో, బాబీ డియోల్ నటించిన ఏక్ బద్నామ్ ఆశ్రమ్ సీజన్ 3 పార్ట్ 2’ 27.1 మిలియన్ల వ్యూయర్స్ తో టాప్ లో ఉన్నాయి.

పెళ్ళికి ముందే తల్లైంది.. కట్ చేస్తే విడాకులు.. ఇప్పుడు తనకన్నా 7ఏళ్ల చిన్నవాడితో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.