AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sharathulu Varthisthai OTT: ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ ఎంటర్టైనర్.. షరతులు వర్తిస్తాయి స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ఇప్పుడు ఓటీటీల్లో మూవీస్.. వెబ్ సిరీస్ చూసేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో అటు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఎప్పటికప్పుడు మంచి కంటెంట్ చిత్రాలు, సస్పెన్స్, థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ తెరకెక్కిస్తూ జనాలను వినోదాన్ని అందిస్తున్నారు. ప్రతి వారం ఓటీటీలో అనేక చిత్రాలను రిలీజ్ చేస్తున్నారు. ఇటీవలే కృష్ణమ్మ సినిమా అడియన్స్ ముందుకు వచ్చింది. తాజాగా మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ షరతులు వర్తిస్తాయి మూవీ ఓటీటీలోకి ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేసింది.

Sharathulu Varthisthai OTT: ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ ఎంటర్టైనర్.. షరతులు వర్తిస్తాయి స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Sharathulu Varthisthai Ott
Rajitha Chanti
|

Updated on: May 18, 2024 | 1:59 PM

Share

ఈసారి వేసవి కాలం సినీ ప్రియులకు నిరాశే మిగిలింది. కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు సైలెంట్ అయ్యాయి. చిన్న చిన్న సినిమాలు మినహా.. స్టార్ హీరోస్, భారీ బడ్జెట్ చిత్రాలు మాత్రం విడుదల కాలేదు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన మూవీస్ కూడా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు ఓటీటీల్లో మూవీస్.. వెబ్ సిరీస్ చూసేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో అటు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఎప్పటికప్పుడు మంచి కంటెంట్ చిత్రాలు, సస్పెన్స్, థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ తెరకెక్కిస్తూ జనాలను వినోదాన్ని అందిస్తున్నారు. ప్రతి వారం ఓటీటీలో అనేక చిత్రాలను రిలీజ్ చేస్తున్నారు. ఇటీవలే కృష్ణమ్మ సినిమా అడియన్స్ ముందుకు వచ్చింది. తాజాగా మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ షరతులు వర్తిస్తాయి మూవీ ఓటీటీలోకి ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేసింది.

30 వెడ్స్ 21 సిరీస్ ద్వారా ఫేమస్ అయిన చైతన్య రావు, భూమిశెట్టి జంటగా నటించిచన సినిమా షరతులు వర్తిస్తాయి. తెలంగాణ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుత సమాజంలో చైన్ సిస్టమ్ బిజినెస్ వల్ల మిడిల్ క్లాస్ ఫ్యామిలీల జీవితాలు ఎలా అతలాకుతలం అవుతున్నాయనే అంశాలను ఈ సినిమాలో చూపించారు. మార్చి 15న థియటర్లలో విడుదలైన ఈ మూవీ పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. కానీ కమర్షియల్ హిట్ కాలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఆహా ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. ఇక ఇప్పటివరకు సరైన ఎంటర్టైన్మెంట్ మిస్సైన వారు ఇప్పుడు ఆహాలో షరతులు వర్తిస్తాయి మూవీని చూసేయ్యోచ్చు.

కథ విషయానికి వస్తే.. తండ్రిని కోల్పోయిన ఈ మిడిల్ క్లాస్ వ్యక్తి అమ్మ, చెల్లి, తమ్ముడితో కలిసి జీవిస్తుంటాడు. తండ్రి మరణం తర్వాత కుటుంబభారం అతడిపై పడుతుంది. ఈ క్రమంలోనే అమ్మాయితో ప్రేమ, పెళ్లి అంటూ కొత్త బాధ్యతలు వస్తాయి. ఇక అతడి జీవితంలోకి చైన్ సిస్టం బిజినెస్ వస్తుంది. అతడు నమ్మకపోయిన.. భర్తకు తెలియకుండానే ఉన్న డబ్బు మొత్తాన్ని ఆ బిజినెస్ లో పెడుతుంది భార్య. చివరకు ఆ కంపెనీ బోర్డ్ తిప్పేయడంతో కుటుంబం రోడ్డున పడుతుంది. ఆ తర్వాత వారి జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేది సినిమా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!