Sonakshi Sinha: మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పిన స్టార్ హీరోయిన్.. అసలు కారణం ఇదే..
మే 1 నుంచి ఈ సిరీస్ను హిందీతోపాటు తెలుగులోనూ అందుబాటులోకి తీసుకువచ్చారు. లాహోర్ లోని హీరామండిలో ఉండే వేశ్యల జీవితాల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ రూపొందించారు డైరెక్టర్ భన్సాలీ. ఇందులో సీనియర్ హీరోయిన్ మనీషా కొయిరాల, సోనాక్షి సిన్హా, అదితి రావు హైదరి, రిచా చద్దా, సంజీదా షేక్ కీలకపాత్రలు పోషించారు. దాదాపు రూ. 200 కోట్ల బడ్జెట్ తో ఈ సిరీస్ తెరకెక్కించారు. అయితే ఇందులో హీరోయిన్ సోనాక్షి సిన్హా నెగిటివ్ షేడ్స్ ఉన్న ఫరీదాన్ పాత్రలో కనిపించింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో కేవలం ఒకే ఒక్క సిరీస్ గురించి చర్చ జరుగుతుంది. ఎలాంటి అంచనాలు, హడావిడి లేకుండా విడుదలై ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది. అదే హీరామండి. డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరామండి సిరీస్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతుంది. మే 1 నుంచి ఈ సిరీస్ను హిందీతోపాటు తెలుగులోనూ అందుబాటులోకి తీసుకువచ్చారు. లాహోర్ లోని హీరామండిలో ఉండే వేశ్యల జీవితాల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ రూపొందించారు డైరెక్టర్ భన్సాలీ. ఇందులో సీనియర్ హీరోయిన్ మనీషా కొయిరాల, సోనాక్షి సిన్హా, అదితి రావు హైదరి, రిచా చద్దా, సంజీదా షేక్ కీలకపాత్రలు పోషించారు. దాదాపు రూ. 200 కోట్ల బడ్జెట్ తో ఈ సిరీస్ తెరకెక్కించారు. అయితే ఇందులో హీరోయిన్ సోనాక్షి సిన్హా నెగిటివ్ షేడ్స్ ఉన్న ఫరీదాన్ పాత్రలో కనిపించింది. ఇందులో ఆమె అద్భుతమైన నటనకు ప్రశంసలు వస్తున్నాయి. ముఖ్యంగా మనీషా కొయిరాల, సోనాక్షి మధ్య వచ్చే సన్నివేశాలు ఈ సిరీస్ కు హైలెట్ అయ్యాయి.
అలాగే ఈ సిరీస్ లో కొన్ని సన్నివేశాల్లో మనీషాతో సోనాక్షి దురుసుగా ప్రవర్తించాల్సి వచ్చింది. ఈ క్రమంలో సిరీస్ స్ట్రీమింగ్ తర్వాత మనీషాకు క్షమాపణలు చెప్పానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఓ ఇంటర్వ్యూలో సోనాక్షి మాట్లాడుతూ.. “నేను మనీషాను ప్రేమిస్తున్నాను. హీరామండి సిరీస్ మొత్తం చూసిన తర్వాత నేను ఆమెకు క్షమాపణలు చెప్పాను. ఎందుకంటే చాలా సన్నివేశాల్లో నేను ఆమెతో దురుసుగా ప్రవర్తించాను. ఆమెతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం నా అదృష్టం. మమ్మల్ని ఎంతో ప్రోత్సహించింది. షూటింగ్ మొత్తం ఎంతో సరదాగా గడిపాం. అవకాశం వస్తే మళ్లీ ఆమెతో కలిసి నటించాలని ఉంది” అంటూ చెప్పుకొచ్చింది.
అలాగే భన్సాలీ గురించి మాట్లాడుతూ.. ‘భన్సాలీ తెరకెక్కించే సినిమాల్లో నటించేవారు అంతగా కష్టపడాల్సిన అవసరం లేదు. సీన్ చిత్రీకరణకు ముందే అన్ని విషయాలను చర్చిస్తాయి. ఆయన స్వతహాగా కళాకారుడు. కాబట్టి ఒక నటీనటుల పనిపై ఆయన ప్రశంసలు కురిపిస్తుంటాడు. సెట్ లో చాలా అందమైన అనుబంధాన్ని ఏర్పాటు చేస్తాడు. అలాగే నటీనటులపై ఎలాంటి ఒత్తిడిని, గందరగోళానికి గురిచేయడు’ అంటూ చెప్పుకొచ్చాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.