DD Returns OTT: ఓటీటీలోకి లేటెస్ట్ కామెడీ హార్రర్.. ‘డీడీ రిటర్న్స్ భూతాల బంగ్లా’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఇటీవల వేరే భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు తెలుగులోకి వచ్చేస్తున్నాయి. కొన్ని థియేటర్లలో రిలీజవుతుంటే, మరికొన్ని మాత్రం డైరెక్టుడా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. ముఖ్యంగా తమిళ్, మలయాళం భాషలకు చెందిన సినిమాలు ఎక్కువగా ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. ఇటీవల సోనీలివ్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చిన పోర్ తోళిల్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు కోలీవుడ్‌కు చెందిన మరో సినిమా తెలుగు స్ట్రీమింగ్‌కు రానుంది.
ఇటీవల వేరే భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు తెలుగులోకి వచ్చేస్తున్నాయి. కొన్ని థియేటర్లలో రిలీజవుతుంటే, మరికొన్ని మాత్రం డైరెక్టుడా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. ముఖ్యంగా తమిళ్, మలయాళం భాషలకు చెందిన సినిమాలు ఎక్కువగా ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. ఇటీవల సోనీలివ్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చిన పోర్ తోళిల్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు కోలీవుడ్‌కు చెందిన మరో సినిమా తెలుగు స్ట్రీమింగ్‌కు రానుంది. ప్రముక కమెడియన్ సంతానం హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా డీడీ రిటర్స్స్. జులై 28న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. సుమారు రూ.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ కామెడీ హార్రర్ సినిమా ఏకంగా రూ. 40 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం. తెలుగులోనూ డీడీ రిటర్న్స్ భూతాల బంగ్లా పేరుతో ఆగస్ట్ 18న రిలీజైంది. అయితే ప్రమోషన్ లేకపోవడంతో పెద్దగా ఆడలేకపోయింది. అయితే ఇప్పుడీ కామెడీ హార్రర్ మూవీ ఓటీటీలోకి రానుంది. థియేటర్లలో రిలీజైన రెండు వారాల గ్యాప్‌లోనే డిజిటల్ స్ట్రీమింగ్‌కు రావడం గమనార్హం. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 డీడీ రిటర్న్స్ ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈక్రమంలో సెప్టెంబర్ 1 నుంచే ఈ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది.
కథేంటంటే..
2016లొ రిలీజైన ‘దిల్లుకు దుడ్డు’ సినిమాకు సీక్వెల్‌గా ‘డీడీ రిటర్న్స్’ సినిమా తెరకెక్కింది. ప్రేమ్ ఆనంద్ దర్శకత్వం వహించిన డీడీ రిటర్న్స్ సినిమాలో సంతానం సరసన సురభి హీరోయిన్‌గా నటించింది. రెడిన్ కింగ్‌స్లే, ప్రదీప్ రావత్, రాజేంద్రన్, సభామారన్, విజయన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. తాము చోరీ చేసిన కోట్లాది రూపాయల డబ్బును పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు ఓ భూతాల బంగ్లాలో దాచిపెడతారు కొందరు. ఆ బ్యాగ్‌ను తిరిగి తెచ్చుకునేందుకు బంగ్లా నుంచి తీసుకువచ్చే క్రమంలో సంతానం అండ్ కో కు ఎదురైన పరిస్థితులను ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కించారు. భయపెడుతూనే కడుపుబ్బా నవ్వించే ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయి ఉంటే.. ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
డీడీ రిటర్న్స్ భూతాల బంగ్లా స్ట్రీమింగ్ డిటెయిల్స్
Santhanam starring #DDReturns digital arrives September 1 on @ZEE5India.@ZEE5Tamil @Surbhiactress pic.twitter.com/ngXiTdBnSv
— Ott Updates (@Ott_updates) August 26, 2023
థియేటర్లలో రిలీజైన రెండు వారాలకే..
✓ #DDReturns Premieres On @ZEE5Tamil From SEP 1 . .#DDReturnsOnZEE5#Santhanam @Surbhiactress @iamsanthanam #Kick #VadakkupattiRamasamy #Santa #DhillukkuDhuttu @ZEE5India
More Detailshttps://t.co/OrsxOrq7lM
✓ Follow 👉 @Digital_OTT pic.twitter.com/fwN5hsKPfS
— DIGITAL OTT PLATFORM (@Digital_OTT) August 25, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..