Gandeevadhari Arjuna: ఓటీటీలోకి రానున్న వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. గతంలో వచ్చిన గని సినిమా నిరాశపరచడంతో ఇప్పుడు గాండీవధారి అర్జున పై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా నిరాశపరిచింది. గాండీవధారి అర్జున సినిమా ఆగస్టు 25న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Gandeevadhari Arjuna: ఓటీటీలోకి రానున్న వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
Gandeevadhari Arjuna
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 28, 2023 | 7:15 AM

వరుణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గాండీవధారి అర్జున సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది. అంతకు ముందు అక్కినేని అఖిల్ తో ఏజెంట్ సినిమాలో నటించింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. గతంలో వచ్చిన గని సినిమా నిరాశపరచడంతో ఇప్పుడు గాండీవధారి అర్జున పై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా నిరాశపరిచింది. గాండీవధారి అర్జున సినిమా ఆగస్టు 25న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

త్వరలోనే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానుందని తెలుస్తుంది. ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ గా ఉంటాయి. అలాగే ఈ మూవీ కలెక్షన్స్ కూడా ఆశించిన స్థాయిలో రాబట్టలేకపోయింది. ఈ సినిమా రిలీజ్ అయిన 3 వారాలకు ఓటీటీలో దర్శనం ఇవ్వనుందని తెలుస్తోంది.

వినాయక చవితి పండగ పురస్కరించుకొని ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయనున్నారని టాక్. గాండీవధారి అర్జున సినిమా సెప్టెంబర్ 15 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ఒక వేళ అప్పుడు సినిమా మిస్ అయితే సెప్టెంబర్ 21 న ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కానుందని తెలుస్తోంది.

‘గాండీవధారి అర్జున’ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీకోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తర్వాత మట్కా అనే సినిమా చేస్తున్నారు. కరణ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు వరుణ్.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.