Rashmika Mandanna: రష్మిక పేరు మారిపోయింది.. మందన్న కాస్త మడోనాగా.. ఎందుకంటే..
Rashmika: రష్మిక మందన.. ఇప్పుడు ఈ పేరు టాలీవుడ్‌లో తెగ మారుమోగుతోంది. ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అందాల తార తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతోంది. అతి తక్కువ కాలంలో అగ్ర హీరోల సరసన..
Rashmika: రష్మిక మందన్న.. ఇప్పుడు ఈ పేరు టాలీవుడ్‌లో తెగ మారుమోగుతోంది. ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అందాల తార తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతోంది. అతి తక్కువ కాలంలో అగ్ర హీరోల సరసన నటిస్తూ హిట్‌ల మీద హిట్లు అందుకుంటూ టాలీవుడ్ అగ్ర స్థానం రేసులో ముందు వరుసలో నిలుస్తోంది. వరుస విజయాలతో లక్కీ హీరోయిన్‌గా మారిపోయింది.
ఇక తాజాగా ఈ అమ్మడు నటించిన పుష్ప సినిమా ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లో భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా విజయంలో రష్మిక కూడా తనవంతు పాత్రను పోషిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో రష్మికకు సహజంగానే పాన్ ఇండియా స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాను అమేజన్ ఓటీటీ వేదికగా విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి హిందీ మినహాయించి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదిలా ఉంటే తాజాగా అమెజాన్ చేసిన ఓ తప్పు చర్చనీయాంశంగా మారింది. సినిమా చవరిలో రష్మిక పేరును తప్పుగా ప్రచురించారు. రష్మిక మందన్న పేరును కాస్త.. ‘రష్మిక మడోనా’గా టెలికాస్ అయ్యింది. దీంతో ఈ పేరును స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు నెటిజన్లు. నటీనటుల పేర్లను తప్పుగా ప్రచురించడం ఏంటంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం రష్మిక మడోనా పేరు నెట్టింట వైరల్ అవుతోంది. మరీ అమెజాన్ ఈ తప్పును సరిదిద్దుకుంటుందో లేదో చూడాలి.
Also Read: Dolo 650: ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్న డోలో 650 ట్యాబ్లెట్.. ఎందుకో తెలిస్తే నవ్వాపుకోలేరు..
Earthquake: భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.9 నమోదు..!
Anantapur: మహిళా కానిస్టేబుల్‌ను బలిగొన్న లైంగిక వేధింపులు.. సూసైడ్ నోట్‌లో షాకింగ్ విషయాలు..