AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Boys Hostel OTT: ఓటీటీలోకి రీసెంట్‌ సూపర్‌హిట్‌ సినిమా.. ‘బాయ్స్‌ హాస్టల్‌’ స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

జులై 21న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. సరిగ్గా నెల తర్వాత ఇదే సినిమాను 'బాయ్స్‌ హాస్టల్‌' పేరుతో తెలుగులో కూడా విడుదల చేశారు. ఇక్కడి ప్రేక్షకులకు తగ్గట్టుగా తెలుగు వెర్షన్‌లో చాలా మార్పులు చేసి రిలీజ్‌ చేశారు. ఒరిజనల్‌ వెర్షన్‌లో రిష‌బ్ శెట్టి, ర‌మ్య పోషించిన పాత్రలను తెలుగులో తరుణ్‌ భాస్కర్‌, రష్మీ గౌతమ్‌లు కనిపించడం విశేషం. దీంతో బాయ్స్‌ హాస్టల్‌ మూవీకి మంచి స్పందన వచ్చింది

Boys Hostel OTT: ఓటీటీలోకి రీసెంట్‌ సూపర్‌హిట్‌ సినిమా.. 'బాయ్స్‌ హాస్టల్‌' స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?
Boys Hostel Movie
Basha Shek
|

Updated on: Sep 12, 2023 | 7:14 AM

Share

ఇటీవల కన్నడ సినిమాలు కూడా పాన్‌ ఇండియా రేంజ్‌లో హిట్‌ అవుతున్నాయి. కేజీఎఫ్‌-1,2, చార్లీ, కాంతారా తదితర సినిమాలు అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలా ఇటీవల కన్నడలో రిలీజై సూపర్‌హిట్‌గా నిలిచిన చిత్రం హాస్ట‌ల్ హుదుగురు బెక‌గిద్దారే. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన ఈ యూత్‌ఫుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ కన్నడ ఆడియెన్స్‌ను అమితంగా ఆకట్టుకుంది. జులై 21న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. సరిగ్గా నెల తర్వాత ఇదే సినిమాను ‘బాయ్స్‌ హాస్టల్‌’ పేరుతో తెలుగులో కూడా విడుదల చేశారు. ఇక్కడి ప్రేక్షకులకు తగ్గట్టుగా తెలుగు వెర్షన్‌లో చాలా మార్పులు చేసి రిలీజ్‌ చేశారు. ఒరిజనల్‌ వెర్షన్‌లో రిష‌బ్ శెట్టి, ర‌మ్య పోషించిన పాత్రలను తెలుగులో తరుణ్‌ భాస్కర్‌, రష్మీ గౌతమ్‌లు కనిపించడం విశేషం. దీంతో బాయ్స్‌ హాస్టల్‌ మూవీకి మంచి స్పందన వచ్చింది. కలెక్షన్లు కూడా ఓ మోస్తరుగా వచ్చాయి. యూత్‌ను థియేటర్లకు రప్పించిన బాయ్స్‌ హాస్టల్‌ మూవీ ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ 5 బాయ్స్‌ హాస్టల్‌ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను కొనుగోలు చేసింది. సెప్టెంబర్‌ 15 నుంచి ఈ సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది.

ఇవి కూడా చదవండి

వార్దెన్‌ శవంతో ఏం చేశారంటే?

బాయ్స్‌ హాస్టల్‌ సినిమాకు నితిన్‌ కృష్ణమూర్తి దర్శకత్వం వహించారు. తెలుగులో ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్‌ తో క‌లిసి అన్న‌పూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ను విడుదల చేశాయి. కాంతార, విరూపాక్ష సినిమాలకు స్వరాలు సమకూర్చిన అజనీష్ లోక్‌నాథ్ ఈ సినిమాకు స్వరాలు అందించారు. ఇక బాయ్స్ హాస్టల్‌ సినిమా కథ విషయానికి వస్తే.. హాస్టల్ లో ఉండే అజిత్‌కు షార్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటాడు. స్టోరీని హాస్టల్‌ రూమ్‌మేట్స్‌కు చెబుతుంటాడు. అయితే షార్ట్‌ఫిల్మ్‌లో మాదిరిగానే నిజంగానే వారి హాస్ట‌ల్ వార్డెన్ చ‌నిపోతాడు. అతని వద్ద ఒక సూసైడ్‌ లెటర్‌ కూడా లభిస్తుంది అందులో అజిత్‌తో పాటు అతని స్నేహితుల పేర్లు రాసి ఉంటాయి. మరి వార్డెన్‌ శవాన్ని దాచి పెట్టేందుకు హాస్టల్‌ బాయ్స్‌ ఎలాంటి ప్రయత్నాలు చేశారు. ఈక్రమంలో వారికి ఎదురైన అనుభవాలను చక్కటి హాస్యంతో తెరకెక్కించారు. ఆద్యంతం ఫన్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా సాగే ఈ మూవీని థియేటర్లలో మిస్‌ అయ్యుంటే ఓటీటీలో చూసి కడుపుబ్బా నవ్వుకోండి.

రష్మీ గౌతమ్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్
వందే భారత్ స్లీపర్ రైళ్లపై బిగ్ అప్డేట్.. ప్రారంభం ఎప్పుడంటే..?
వందే భారత్ స్లీపర్ రైళ్లపై బిగ్ అప్డేట్.. ప్రారంభం ఎప్పుడంటే..?
కుబేరుడి చూపు మీపై పడాలంటే ఉత్తర దిశలో ఇవి ఉండాల్సిందే..
కుబేరుడి చూపు మీపై పడాలంటే ఉత్తర దిశలో ఇవి ఉండాల్సిందే..
ఉన్నావ్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఉన్నావ్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఏపీలోని మందుబాబులకు శుభవార్త.. పనివేళల్లో మార్పులు
ఏపీలోని మందుబాబులకు శుభవార్త.. పనివేళల్లో మార్పులు
ఈ ఒక్క స్మార్ట్ జాకెట్ ఉంటే చాలు.. చలి గజగజ వణకాల్సిందే!
ఈ ఒక్క స్మార్ట్ జాకెట్ ఉంటే చాలు.. చలి గజగజ వణకాల్సిందే!
ఆడబిడ్డకు జన్మనిచ్చి తల్లి మృతి.. ఇంటికి తీసుకెళ్తుండగా శిశువు..
ఆడబిడ్డకు జన్మనిచ్చి తల్లి మృతి.. ఇంటికి తీసుకెళ్తుండగా శిశువు..