Ram Setu: అక్షయ్‌కుమార్, సత్యదేవ్ కాంబో.. ‘రామ్ సేతు’ అదుర్స్.. ప్రైమ్‌లో ఫ్రీగా చూడొచ్చు
ఈ మూవీలో తెలుగు నటుడు సత్యదేవ్ ఓ కీలక పాత్ర పోషించాడు. అక్షయ్ కుమార్ కాంబినేషన్‌లో సత్యదేవ్ చాలా సీన్లలో నటించాడు. ఓటీటీలో ఈ చిత్రాన్ని ఫ్రీగా చూడొచ్చు.
అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన యాక్షన్-అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రం ‘రామ్ సేతు’. అక్టోబర్ 25న భారతదేశం అంతటా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ.. డిసెంబర్ 23 తేదీ నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుస్రత్ బరూచా ఈ మూవీలో హీరోయిన్స్‌గా నటించారు. టాలెండెట్ హీరో సత్యదేవ్ మరో కీ రోల్ పోషించారు. గతంలో పే పర్ వ్యూ కింద రామ్ సేతు సినిమాను.. ప్రజంట్ ప్రైమ్ మెంబర్షిప్ యాక్టివ్‌గా ఉంటే ఉచితంగా చూడవచ్చు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఇది అందుబాటులో ఉంది. రామ్ సేతు విశిష్టత, దాన్ని రక్షించేందుకు ఆర్కియాలజిస్ట్ చేసే సాహసోపేతమైన జర్నీ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ఈ సినిమా కథ రామాయణం సమయంలో నిర్మించిన రామసేతుపై ఆధారపడి ఉంటుంది. భారతదేశం – శ్రీలంక మధ్య వానర సైన్యం నిర్మించినట్లు భావించే 7,000 సంవత్సరాల పురాతన రామసేతు బ్రిడ్జ్ వాస్తవికతను చూపించడానికి ప్రయత్నించే పురావస్తు శాస్త్రవేత్త ఆర్యన్ కులశ్రేష్ఠ(అక్షయ్ కుమార్) చుట్టూ కథ తిరుగుతుంది. హిందూ ఇతిహాసం రామాయణం ప్రకారం, తన భార్య సీతను అపహరించిన లంకా రాజు రావణుడి నుంచి ఆమెను రక్షించడానికి … రాముడు వానర సైన్యం సహాయంతో ఈ వంతెనను నిర్మించాడని ప్రతీతి.
రాముడి ఉనికికి సంబంధించిన మరిన్ని రుజువులను సేకరించేందుకు డాక్టర్ ఆర్యన్ శ్రీలంకకు వెళతాడు. అతనికి స్థానిక గైడ్ AP (సత్యదేవ్ కంచరణా), పర్యావరణవేత్త, డాక్టర్ సాండ్రా (జాక్వెలిన్ ఫెర్నాండెజ్) సహాయం చేస్తారు. అభిషేక్ శర్మ రామసేతు వారధి రహస్యాల నేపథ్యంలో యాక్షన్-అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రం 143 నిమిషాల నిడివిని కలిగి ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..