OTT Movie: ఓటీటీలో సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్ ట్రెండింగ్.. క్షణ క్షణం మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు..
ఓటీటీలో మీరు వివిధ రకాల కంటెంట్ చిత్రాలను, వెబ్ సిరీస్ చూడొచ్చు. ఈమధ్య కాలంలో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సరికొత్త కథలను తీసుకువస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే కొద్దిరోజులుగా సైకలాజికల్ థ్రిల్లర్ మూవీస్, వెబ్ సిరీస్ ఎక్కువగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సిరీస్ సైతం ఓటీటీలో తెగ్ ట్రెండింగ్ అవుతుంది.

ఓటీటీలో కొన్నా్ళ్లుగా సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్, సినిమాలు తెగ ట్రెండింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. హారర్, సస్పెన్స్ చిత్రాలు కాకుండా ఇప్పుడు థ్రిల్లర్ మూవీస్ చూసేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ఓటీటీలో అత్యధిక వ్యూస్ తో సంచలనం సృష్టిస్తోన్న వెబ్ సిరీస్ గురించి తెలుసా.. ? ఈ సిరీస్ మిమ్మల్ని ఆద్యంతం కట్టిపడేసే సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్. అదే అసుర్. ఈ వెబ్ సిరీస్ మొదటిసారిగా 2020లో తెరపైకి వచ్చింది. ఆ సమయంలో లాక్ డౌన్ కారణంతో నేరుగా ఓటీటీలోనే విడుదల చేశారు. ఆ సిరీస్ ఓటీటీలో సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈ అసుర్ సీజన్ 1 సిరీస్ జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతుంది. సాధారణంగా కనిపించే ఓ యువకుడి కథే ఈ సిరీస్.
ఆ యువకుడి మైండ్ సెట్ అందరికంటే భిన్నంగా ఉంటుంది. మతం, ఆధ్యాత్మికత, విజ్ఞానశాస్త్రాలను అతడు విభిన్నంగా ఉపయోగిస్తాడు. నిరంతరం ప్రజల మనసును మార్చేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరిని హత్య చేస్తుంటాడు. దీంతో సీబీఐ రంగంలోకి దిగుతుంది. అతడి కోసం వెతకడం ప్రారంభిస్తారు. కానీ ఆ హత్యను పక్కా ప్రణాళికతో చేసే సీరియల్ కిల్లర్ గా మారిన ఆ యువకుడిని పట్టుకోవడం చాలా కష్టమవుతుంది. ఈ సిరీస్ లో అర్షద్ వార్సీ సీబీఐ అధికారి ధనంజయ్ రాజ్ పుత్ పాత్రను పోషిస్తుండగా.. వరుణ్ సోబ్తి నిఖిల్ నాయర్ పాత్రకు ప్రాణం పోశారు.
ఇందులో అనుప్రియ గోయెంకా ,లోలార్క్ దూబే కీలకపాత్రలు పోషించారు. ప్రతి ఎపిసోడ్ లో ఆద్యంతం కట్టిపడేసే ట్విస్టులతో సాగుతుంది. చివరకు క్లైమాక్స్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. మొత్తం 8 ఎపిసోడ్స్ వెంటవెంటనే చూడాలనే కూతుహలం కలిగిస్తుంది. ఇప్పటివరకు అసుర్ రెండు సీజన్స్ విజయవంతంగా కంప్లీట్ కాగా.. త్వరలోనే అసుర్ సీజన్ 3 రాబోతుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి :
Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..




