Bhamakalapam 2 OTT: ఓటీటీలో భామాకలాపం 2కు సూపర్ రెస్పాన్స్.. 24 గంటల్లో రికార్డు వ్యూస్.. ఎక్కడ చూడొచ్చంటే?
ప్రియమణి ప్రధాన పాత్రలో రెండేళ్ల క్రితం వచ్చిన లేడీ ఓరియంటెడ్ మూవీ భామా కలాపం.ఫ్యామిలీ స్టోరీకి కాస్త థ్రిల్లర్ టచ్‌తో తెరకెక్కిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది .ఇప్పుడిదే సినిమాకు సీక్వెల్ వచ్చింది. భామాకలాపం 2 పేరుతో ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అభిమన్యు తాడిమేటి తెరకెక్కించిన ఈ హీస్ట్ థ్రిల్లర్ లో ప్రియమణితో పాటు ఫిదా ఫేమ్ శరణ్య ప్రదీప్ కీలక పాత్ర పోషించింది.

ప్రియమణి ప్రధాన పాత్రలో రెండేళ్ల క్రితం వచ్చిన లేడీ ఓరియంటెడ్ మూవీ భామా కలాపం.ఫ్యామిలీ స్టోరీకి కాస్త థ్రిల్లర్ టచ్‌తో తెరకెక్కిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది .ఇప్పుడిదే సినిమాకు సీక్వెల్ వచ్చింది. భామాకలాపం 2 పేరుతో ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అభిమన్యు తాడిమేటి తెరకెక్కించిన ఈ హీస్ట్ థ్రిల్లర్ లో ప్రియమణితో పాటు ఫిదా ఫేమ్ శరణ్య ప్రదీప్ కీలక పాత్ర పోషించింది. శుక్రవారం (ఫిబ్రవరి 16) అర్ధరాత్రి నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ఈ మూవీ స్ట్రీమింగ్‌కు అందుబాటులో వచ్చింది. మొదటి భాగం కంటే రెండో పార్ట్‌కు సూపర్ రెస్పాన్స్‌వస్తోంది. ఇదే విషయాన్ని ఆహా ఓటీటీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. భామాకలాపం 2కు 24 గంటల్లోనే బ్లాస్టింగ్ 50 మిలియన్లకు స్ట్రీమింగ్ మినిట్స్ దాటాయి’ అని తమ అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ‘ఇది ది డేంజరస్ హౌస్ వైఫ్ రూలు. భామాకలాపం 2కు 24 గంటల్లోనే బ్లాస్టింగ్ 50 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్లు క్రాస్ అయ్యింది’ అని ఆహా ట్వీట్ చేసింది. అలాగే ఇందుకు సంబంధించి ఒక ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. డేంజరస్ హౌస్ వైఫ్ రూల్ కొనసాగుతుందని అందులో పేర్కొంది.
భామకలాపం సినిమాలో సీరత్ కపూర్, రఘు ముఖర్జీ, సుదీప్ వేద్, అనూజ్ గుర్వారా, రుద్ర ప్రతాప్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అనుపమ అనే గృహిణీ పాత్రలో ప్రియమణి అభినయం అదిరిపోయిందని కామెంట్స్ వస్తున్నాయి. అలాగే శిల్ప క్యారెక్టర్ లో శరణ్య మరోసారి ఆకట్టుకుందని ప్రశంసలు వినిపిస్తున్నాయి. డ్రీమ్ ఫార్మర్స్ పతాకంపై బాపినీడు, సుధీర్ ఈదర భామకలాపం 2 చిత్రాన్ని నిర్మించారు. ప్రశాంత్ వి విహారీ సంగీతం అందించారు.
24 గంటల్లోనే 50 మిలియన్లకు పైగా..
Idhi THE DANGEROUS HOUSE WIFE RULE-UUU! 🔥
A Blasting 5️⃣ 0️⃣ MILLION+ views & counting for #Bhamakalapam2 in just 2️⃣ 4️⃣ Hours 👩🍳🔪
Streaming Now on @ahavideoIN 🤩https://t.co/S73lwzRPBD#Priyamani #SharanyaPradeep @IamSeeratKapoor #AbhimanyuTadimeti @prashanthvihari… pic.twitter.com/bdDcgxOLYc
— ahavideoin (@ahavideoIN) February 17, 2024
ఆహాలో స్ట్రీమింగ్..
Sending Solid reasons your way so you don’t miss the Solid Entertainment of #Bhamakalapam2 👩🍳🔪
Streaming Now on @ahavideoIN 🤩▶️https://t.co/S73lwzRhM5#Priyamani #SharanyaPradeep @IamSeeratKapoor #AbhimanyuTadimeti @prashanthvihari @sudheer_ed @WeDreamFarmer @sprite_india pic.twitter.com/WWHKje9EfL
— ahavideoin (@ahavideoIN) February 18, 2024
భామకలాపం 2 ట్రైలర్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








