AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rebel OTT: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ప్రేమ‌లు హీరోయిన్ లేటెస్ట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడంటే?‌

ప్రేమ‌లు' సినిమాతో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది మమితా బైజు. ఈ మూవీలో రినీ రాయ్ పాత్రలో ఆమె అందం, అభినయానికి అందరూ ఫిదా అయ్యారు. ముఖ్యంగా యువత కలల రాణిగా మారిపోయిందీ అందాల తార. తెలుగులోనూ ఈ ముద్దుగుమ్మకు మంచి క్రేజ్ వచ్చింది. మరో సాయిపల్లవి అంటూ ట్యాగ్ కూడా ఇచ్చేశారు

Rebel OTT: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ప్రేమ‌లు హీరోయిన్ లేటెస్ట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడంటే?‌
Rebel Movie
Basha Shek
|

Updated on: Apr 06, 2024 | 6:50 PM

Share

‘ప్రేమ‌లు’ సినిమాతో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది మమితా బైజు. ఈ మూవీలో రినీ రాయ్ పాత్రలో ఆమె అందం, అభినయానికి అందరూ ఫిదా అయ్యారు. ముఖ్యంగా యువత కలల రాణిగా మారిపోయిందీ అందాల తార. తెలుగులోనూ ఈ ముద్దుగుమ్మకు మంచి క్రేజ్ వచ్చింది. మరో సాయిపల్లవి అంటూ ట్యాగ్ కూడా ఇచ్చేశారు. ప్రేమమ్ సినిమా తర్వాత మమితా మైజుకు మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో సినిమా ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రేమలు తర్వాత ఈ అమ్మడు నటించిన తమిళ చిత్రం రెబెల్. ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ ఇందులో హీరోగా నటించాడు. నికేష్ ఆర్ ఎస్ దర్శకత్వం వహించాడు. మార్చి 22న థియేటర్లలో రిలీజైన రెబెల్ సినిమా యావరేజ్ గా నిలిచింది. ఓ మోస్తారు కలెక్షన్లు వచ్చేశాయి. అయితే థియేటర్లలో విడుదలైన 15 రోజులకే రెబెల్ సినిమా ఓటీటీలో ప్రత్యక్షమైంది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. తమిళ్ తో పాటు తెలుగులోనూ రెబెల్ సినిమా స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

రెండు వారాలకే ఓటీటీలోకి స్ట్రీమింగ్..

ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో రిలీజవుతోన్న సినిమాలన్నీ రెంటల్ బేసిస్ విధానంతోనే స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. అయితే రెబెల్ సినిమాను చూడడానికి ఎలాంటి డబ్బులు చెల్లించనక్కర్లేదు. అంటే అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ఉన్న వారు రెబెల్ సినిమాను ఉచితంగా చూడవచ్చన్న మాట. స్టూడియో గ్రీన్ ప‌తాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా, నేహా జ్ఞానవేల్ రాజా నిర్మాణంలో సుమారు రూ. 40 కోట్లతో పాన్‌ ఇండియా రేంజ్‌లో రెబెల్ సినిమాను నిర్మించారు. స్డూడెంట్స్ గొడవలు, రాజకీయం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. వీకండ్ లో టైమ్ పాస్ కోసం రెబెల్ సినిమాపై ఓ లుక్ వేయవచ్చు.

అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ లో స్ట్రీమింగ్..

రెబెల్ సినిమాలో జీవీ ప్రకాశ్ కుమార్, మమితా బైజు..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..