Paramporul OTT: తెలుగులో తమిళ్ బ్లాక్‌ బస్టర్‌.. డైరెక్టుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్‌.. ఎప్పుడు, ఎక్కడంటే?

గతేడాది తమిళంలో బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన సినిమా ఒకటి ఇప్పుడు తెలుగులో రానుంది. అది కూడా డైరెక్టుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్‌ అవ్వనుంది. అదే అమితాశ్‌ ప్రధాన్‌, శరత్ కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటించిన పరంపోరుల్‌. గ‌త ఏడాది త‌మిళంలో సెప్టెంబ‌ర్ 1న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌..

Paramporul OTT: తెలుగులో తమిళ్ బ్లాక్‌ బస్టర్‌.. డైరెక్టుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్‌.. ఎప్పుడు, ఎక్కడంటే?
Paramporul Movie
Follow us
Basha Shek

|

Updated on: Feb 03, 2024 | 8:16 PM

వివిధ భాషల్లో హిట్‌ అయిన సినిమాలు ఇప్పుడు తెలుగులో రిలీజవుతున్నాయి. కొన్ని థియేటర్లలో విడుదలవుతుంటే మరికొన్ని డైరెక్టుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్‌కు వచ్చేస్తున్నాయి. అలా గతేడాది తమిళంలో బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన సినిమా ఒకటి ఇప్పుడు తెలుగులో రానుంది. అది కూడా డైరెక్టుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్‌ అవ్వనుంది. అదే అమితాశ్‌ ప్రధాన్‌, శరత్ కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటించిన పరంపోరుల్‌. గ‌త ఏడాది త‌మిళంలో సెప్టెంబ‌ర్ 1న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ అక్కడి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. పురాత‌న విగ్ర‌హాల అక్ర‌మ ర‌వాణా నేప‌థ్యంలో సాగే ఈ సినిమా భారీగానే వసూళ్లు రాబట్టింది. ఇప్పుడీ పరంపోరుల్‌ సినిమా తెలుగు ఓటీటీ ఆడియెన్స్‌ను అలరించేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఈటీవీ విన్‌లో  ఫిబ్రవరి 1 నుంచి ఈ సూపర్‌ హిట్ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్‌కు అందుబాటులో రానుంది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసింది ఈటీవీ విన్‌.

అర‌వింద్‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వహించిన పరంపోరుల్‌ సినిమాలో క‌శ్మీరా ప‌ర‌దేశీతో పాటు బాలాజీ శ‌క్తివేల్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. యువ‌ర్ శంక‌ర్ రాజా బ్యాక్‌గ్రౌండ్ అందించిన బీజీఎమ్‌ సినిమాను నెక్ట్స్‌లెవెల్‌కు తీసుకెళ్లింది. ఇక సినిమా కథ విషయానికొస్తే.. ఆది (అమితాశ్‌ ప్రధాన్‌) నిజాయితీగా ఉంటాడు. అయితే కొన్ని అత్యవసర సరిస్థితుల కారణంగా పురాతన విగ్రహాలు చోరీ చేసే ముఠాతో చేతులు కలుపుతాడు. ప్రముఖ పోలీస్ ఆఫీస‌ర్ మైత్రేయ‌న్‌తో (శ‌ర‌త్‌కుమార్‌) క‌లిసి ప‌నిచేయ‌డానికి అంగీకరిస్తాడు. మరి ఆ డీల్ ఆది జీవితాన్ని ఎలాంటి మ‌లుపులు తిప్పింది అన్న‌దే ప‌రంపోరుల్ మూవీ క‌థ‌. మంచి సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ చూడాలనుకునేవారికి పరంపోరుల్‌ ఒక మంచి చాయిస్‌.

ఇవి కూడా చదవండి

ఫిబ్రవరి 1 నుంచి ఈటీవీ విన్ లో..

ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోన్న ఇతర సినిమాలు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..