AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Annapoorani OTT: మళ్లీ ఓటీటీలోకి నయనతార కాంట్రవర్సీ మూవీ.. ‘అన్నపూరణి’ ఎందులో చూడొచ్చంటే?

నయన్ నటించిన కొన్ని సినిమాలు వివాదాల్లో కూడా చిక్కుకున్నాయి. అందులో అన్న పూరణి ఒకటి. గతేడాది డిసెంబర్ లో ఈ మూవీ రిలీజైంది.అయితే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు హిందువుల మత మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ కొందరు ఆందోళనలకు దిగారు. చాలా చోట్ల సినిమా ప్రదర్శనలను కూడా అడ్డుకున్నారు. ఇదే కారణంతోనే ‘అన్నపూర్ణి’ సినిమాను ఓటీటీ ప్లాట్‌ఫాం నుంచి కూడా తొలగించారు

Annapoorani OTT: మళ్లీ ఓటీటీలోకి నయనతార కాంట్రవర్సీ మూవీ.. 'అన్నపూరణి' ఎందులో చూడొచ్చంటే?
Annapoorani Movie
Basha Shek
|

Updated on: Aug 07, 2024 | 6:57 PM

Share

ప్రముఖ నటి నయనతార అన్ని రకాల పాత్రలు పోషించి సౌతిండియన్ లేడీ సూపర్ స్టార్ అని గుర్తింపు తెచ్చుకుంది. ఓ వైపు లేడీ ఓరియంటెడ్ చేస్తూనే, మరోవైపు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ బిజీ బిజీగా ఉంటోందీ అందాల తార. అయితే నయన్ నటించిన కొన్ని సినిమాలు వివాదాల్లో కూడా చిక్కుకున్నాయి. అందులో అన్న పూరణి ఒకటి. గతేడాది డిసెంబర్ లో ఈ మూవీ రిలీజైంది.అయితే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు హిందువుల మత మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ కొందరు ఆందోళనలకు దిగారు. చాలా చోట్ల సినిమా ప్రదర్శనలను కూడా అడ్డుకున్నారు. ఇదే కారణంతోనే ‘అన్నపూర్ణి’ సినిమాను ఓటీటీ ప్లాట్‌ఫాం నుంచి కూడా తొలగించారు. అయితే ఇప్పుడు మళ్లీ ఈ చిత్రం OTTలో వీక్షించడానికి అందుబాటులో ఉంటుంది. అయితే ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. ‘అన్నపూర్ణి’ సినిమా టైటిల్‌ను బట్టి ఇది వంటలకు సంబంధించిన కథ. ఈ చిత్రానికి ‘ది గాడెస్ ఆఫ్ ఫుడ్’ అనే ట్యాగ్‌లైన్ కూడా ఉంది. ఈ సినిమాలో లవ్ జిహాద్ అంశాలు ఉన్నాయని కొందరు ఆరోపించడంతో దర్శక నిర్మాతలు క్షమాపణలు చెప్పారు. అలాగే కొన్ని మార్పులు కూడా చేయనున్నట్లు తెలిపారు.

ఇప్పుడు మళ్లీ నెట్‌ఫ్లిక్స్‌లో ‘అన్నపూర్ణి’ సినిమా స్ట్రీమింగ్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆగస్ట్ 9 నుంచి ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ట్విస్ట్ ఏమిటంటే ఈ సినిమా భారతదేశంలో స్ట్రీమింగ్ కాదు! మరి చిత్రబృందం ఇందులో ఏమైనా మార్పులు చేసిందా లేదా అన్నది ఆగస్ట్ 9న తేలనుంది. కాగా 2023లో ‘అన్నపూర్ణి’ సినిమా వివాదంలో చిక్కుకున్నప్పుడు నటి నయనతార ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సినిమా ఉద్దేశ్యం ప్రజల్లో స్ఫూర్తి నింపడమే తప్ప ఎవరినీ నొప్పించకూడదని క్లారిటీ ఇచ్చింది. అన్న పూరణి సినిమాకు నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. ప్రముఖ కన్నడ నటుడు అచ్యుత్ కుమార్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. అతని నటనకు కూడా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభించాయి.

ఇవి కూడా చదవండి

కాగా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన నయన తార గతేడాది ‘జవాన్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఆమె చేతిలో చాలా సినిమాలున్నాయి. యష్ ‘టాక్సిక్’లో కూడా నయనతార నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పొన్నగంటి పోషకాల పవర్‌హౌజ్‌.. తరచూ తింటే ఆ సమస్యలన్నీమాయం..!
పొన్నగంటి పోషకాల పవర్‌హౌజ్‌.. తరచూ తింటే ఆ సమస్యలన్నీమాయం..!
సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. సీనియర్ హీరో..
సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. సీనియర్ హీరో..
ఒకటి కంటే ఎక్కువ PF అకౌంట్లు ఉన్నాయా? వాటిని విలీనం చేయడం ఎలా?
ఒకటి కంటే ఎక్కువ PF అకౌంట్లు ఉన్నాయా? వాటిని విలీనం చేయడం ఎలా?
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..