AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Buddy OTT : ఓటీటీలోకి అల్లు శిరీష్ లేటెస్ట్ మూవీ.. బడ్డీ మూవీ స్ట్రీమింగ్ అయ్యింది అప్పుడేనా..

అల్లు శిరీష్ హీరోగా నటించిన ఈ సినిమా ఇటీవలే థియేటర్స్ లోకి వచ్చింది. ఈ ఫాంట‌సీ యాక్ష‌న్ ల‌వ్ స్టోరీ ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. చాలా రోజుల తర్వాత శిరీష్ నటించిన సినిమా థియేటర్స్ లోకి వచ్చింది. గౌరవం సినిమాతో హీరోయిన్ హీరోగా పరిచయమైనా శిరీష్.. ఆతర్వాత కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు సినిమాలతో హిట్ అందుకున్నాడు.

Buddy OTT : ఓటీటీలోకి అల్లు శిరీష్ లేటెస్ట్ మూవీ.. బడ్డీ మూవీ స్ట్రీమింగ్ అయ్యింది అప్పుడేనా..
Buddy
Rajeev Rayala
|

Updated on: Aug 08, 2024 | 12:08 PM

Share

కొత్త సినిమాలు ఓటీటీలోకి నెలలోపే వచ్చేస్తున్నాయి. కొన్ని సినిమాలు వారం రోజుల్లోనే ఓటీటీలోకి వస్తుంటాయి. కొన్ని సినిమాలు ఇంతవరకూ ఓటీటీలోకి రాలేదు. ఇక ఇప్పుడు ఓ కొత్త సినిమా ఓటీటీలోకి రావడానికి రెడీ అవుతోంది. ఆ సినిమానే బ‌డ్డీ. అల్లు శిరీష్ హీరోగా నటించిన ఈ సినిమా ఇటీవలే థియేటర్స్ లోకి వచ్చింది. ఈ ఫాంట‌సీ యాక్ష‌న్ ల‌వ్ స్టోరీ ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. చాలా రోజుల తర్వాత శిరీష్ నటించిన సినిమా థియేటర్స్ లోకి వచ్చింది. గౌరవం సినిమాతో హీరోయిన్ హీరోగా పరిచయమైనా శిరీష్.. ఆతర్వాత కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు సినిమాలతో హిట్ అందుకున్నాడు. ఇక 2022లో ఊర్వశివో రాక్షసివో అనే సినిమా చేశాడు. ఈ సినిమా తర్వాత రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకొని ఇప్పుడు బడ్డీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

గాయత్రీ భరద్వాజ్, ప్రిషా రాజేశ్‌ సింగ్‌, అలీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్టు 2న థియేటర్స్‌లో రిలీజ్ అయ్యింది. హిప్‌హాప్ తమిళ ఈ సినిమాకు సంగీతం అందించారు. స్టూడియో గ్రీన్‌ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై జ్ఞానవేల్‌ రాజా, అధన జ్ఞానవేల్‌ రాజా నిర్మించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రావడానికి రెడీ అవుతోంది. సెప్టెంబ‌ర్ ఫ‌స్ట్ వీక్ నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు తెలుస్తోంది.

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఫ్యాన్సీ రేటుకు బడ్డీ సినిమాను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. సెప్టెంబ‌ర్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ప్టెంబ‌ర్ ఫ‌స్ట్ వీక్‌లో అల్లు శిరీష్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు చెబుతోన్నారు. ఈ సినిమాను కేవలం తెలుగులోనే కాదు.. తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. ఆర్య హీరోగా 2021లో విడుద‌లైన‌ టెడ్డీ మూవీకి రీమేక్‌గా బ‌డ్డీ రూపొందింది. థియేటర్స్ లో ఓకే అనిపించినా ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us