Newsense: మీడియా రంగంలో సరికొత్త కోణాన్ని ఆవిష్కరించే న్యూసెన్స్.. ఆహాలో స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
వదీప్, బింధు మాధవి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న న్యూసెన్స్ వెబ్ సిరీస్‌కు ప్రవీణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రిలీజైన టీజర్లు, పోస్టర్లకి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది.
సరికొత్త ఆలోచనలతో వైవిధ్య మైన కంటెంట్‌ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తోన్న 100% లోకల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’. ఎప్ప టికప్పప డు సరికొత్త, విలక్షణమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఆడియెన్స్‌ను అలరిస్తోందీ ఓటీటీ మాధ్యమం. తాజాగా మీడియా రంగంలోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ న్యూసెన్స్ పేరుతో మరో వెబ్‌సిరీస్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. నవదీప్, బింధు మాధవి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న న్యూసెన్స్ వెబ్ సిరీస్‌కు ప్రవీణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రిలీజైన టీజర్లు, పోస్టర్లకి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్ కి బొమ్మరిల్లు భాస్కర్, నవదీప్,బిందు మాధవి, డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, వివేక్ కూచిబట్ల తదితరులు హాజరయ్యారు. న్యూసెన్స్ వెబ్ సిరీస్ సూపర్ హిట్ కావాలని అందరూ ఆకాంక్షించారు. కాగా న్యూసెన్స్ సిరీస్ మే 12 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
ప్రస్తుత సమాజంలో మీడియాకి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? డబ్బు ఉన్న వాళ్లు దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు? వాస్తవాలను దాచేసి వాళ్లకి అనుగుణంగా ఎలా మార్చుకుంటున్నారు అనేది ఈ సిరీస్ లో చూపిస్తామంటున్నారే మేకర్స్. టోటల్‌గా చెప్పాలంటే.. ఈరోజుల్లో న్యూస్ అనేది న్యూసెన్స్ లా ఎలా మారిపోతుంది అనేది సెటైరికల్‌గా చూపిస్తున్నామన్నారు. పార్ట్ వన్ జస్ట్ కథలో చిన్న భాగమేనని పార్ట్ 2 అంతకు మించి ఉంటుందని మేకర్స్ పేర్కొన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..