AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీలో సూపర్ హిట్ హార‌ర్ క్రైమ్ థ్రిల్ల‌ర్ .. IMDB లో 9.1 రేటింగ్.. దిమ్మతిరిగే ట్విస్టులు

ఈ సినిమాలో హారర్, క్రైమ్, థ్రిల్లింగ్, సస్పెన్స్.. ఇలా అన్నీ అంశాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే థియేటర్లలో ఆడియెన్స్ కు ఈ మూవీ మంచి థ్రిల్ ఇచ్చింది. అలాగే ఐఎమ్ డీబీ లో ఈ సినిమాకు 10కి 9.1 రేటింగ్‌ రావడం గమనార్హం.

OTT Movie: ఓటీటీలో సూపర్ హిట్ హార‌ర్ క్రైమ్ థ్రిల్ల‌ర్ .. IMDB లో 9.1 రేటింగ్.. దిమ్మతిరిగే ట్విస్టులు
OTT Movie
Basha Shek
|

Updated on: Apr 23, 2025 | 6:41 PM

Share

ప్రస్తుతం ఓటీటీల్లో ఎలాంటి సినిమాలు ట్రెండ్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే. క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్, హారర్ సినిమాలకే ఆడియెన్స్ ఎక్కువ ఓటు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓటీటీ ప్రేక్షకులను భయపెట్టి థ్రిల్ చేసేందుకు మరో సూపర్ హిట్ హారర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు రానుంది. ఈ సినిమాలో ప్రముఖ నటుడు నాజర్ లీడ్ రోల్ పోషించడం విశేషం. అలాగే త‌లైవాస‌ల్ విజ‌య్‌, జ‌య‌కుమార్ జాన‌కిరామ‌న్‌, వినోద్ కిష‌న్ తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. ఆసక్తికరమైన క‌థ‌, క‌థ‌నాల‌తో పాటు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, ట్విస్ట్‌లు సినిమాను చూసిన ఆడియెన్స్ ను థ్రిల్ కు గురి చేశాయి. కామెడీ, క‌మ‌ర్షియ‌ల్‌ హంగులకు జోలికి ఏ మాత్రం వెళ్లకుండా సీరియ‌స్ డార్క్ హార‌ర్ థ్రిల్ల‌ర్‌గా ద‌ర్శ‌కుడు ఈ మూవీని తెర‌కెక్కించాడు. థియేటర్లలో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఐఎమ్‌డీబీలో ఈ మూవీ ప‌దికి 9.1 రేటింగ్‌ రావడం విశేషం. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. ఒక అమ్మాయి క్షుద్ర‌విద్య‌లు, అతీంద్రియ శ‌క్తుల స‌హాయంతో వ‌రుస‌గా హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతుంది. ఈ హ‌త్య‌ల వెనుక ఉన్న మిస్ట‌రీని ఛేదించేందుకు ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీస‌ర్ బరిలోకి దిగుతాడు. విచారణలో అతనికి షాకింగ్ విషయాలు తెలుస్తాయి. మరి ఆ అమ్మాయి ఎందుకు అంత వితంగా ప్రవర్తిస్తుంది? అసలు ఆ హత్యల వెనక ఉన్న మిస్టరీ ఏంటన్నదే ఈ సినిమా కథ.

ఇంతకీ హారర్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఏదనుకుంటున్నారా? ఈ మూవీ పేరు ది అకాళి. కోలీవుడ్ డైరెక్టర్ మహ్మద్ మ‌హ‌మ్మ‌ద్ ఆసీఫ్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. గతేడాది థియేటర్లలో రిలీజైన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికే తమిళ్‌ ఆహాలో ఈ మూవీ స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇప్పుడు అదే ఆహా ఓటీటీ వేదికగా ఈ నెల 26 నుంచి ది అకాళ్ మూవీ తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ కు రానుంది. ఈ వేసవి సెలవుల్లో మంచి హారర్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూడాలనుకునేవారికి ది అకాళ్ మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఆహాలో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి