AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thandel OTT: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి నాగ చైతన్య 100 కోట్ల సినిమా.. తండేల్ మూవీని ఎక్కడ చూడొచ్చంటే?

టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన చిత్రం తండేల్. మత్స్యకారుల జీవితంలో జరిగిన వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి కథానాయికగా నటించింది. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 07న విడుదలైన తండేల్100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.

Thandel OTT: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి నాగ చైతన్య 100 కోట్ల సినిమా.. తండేల్ మూవీని ఎక్కడ చూడొచ్చంటే?
Thandel Movie
Basha Shek
|

Updated on: Mar 06, 2025 | 12:05 PM

Share

లవ్ స్టోరీ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత నాగ చైతన్య, సాయి పల్లవి మరోసారి జంటగా నటించిన చిత్రం తండేల్. మత్స్యకారుల జీవితంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటన ఆధారంగా చందూ మొండేటి ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ని తెరకెక్కించాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో బన్నీ వాసు, అల్లు అరవింద్ కలిసి తండేల్ సినిమాను నిర్మించారు. అభిమానుల భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 07న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. నాగ చైతన్య, సాయి పల్లవిల సూపర్బ్ యాక్టింగ్, దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు సినిమాకు హైలెట్ గా నిలిచాయి. రిలీజైన కొద్ది రోజులకే సినిమా హెచ్ డీ పైరసీ వెర్షన్లు ఆన్ లైన్ లో లీకయినా ఈ సినిమా వసూళ్లు ఏ మాత్రం తగ్గలేదు. ఓవరాల్ గా తండేల్ సినిమా రూ.100 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టింది. ఈ విషయాన్ని చిత్ర బృందమే అధికారికంగా ప్రకటించింది. కాగా నాగ చైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన తండేల్ ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇటీవలే సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై అధికారిక ప్రకటన కూడా వెలువరించింది. మార్చి 07 నుంచి నాగ చైతన్య సినిమాను తమ ఓటీటీలో స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించింది. అంటే ఇవాళ్టి అర్ధ రాత్రి నుంచే తండేల్ సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి రానుందన్న మాట.

ఈ సినిమాలో నాగ చైతన్య తండేల్ రాజు అనే పాత్రలో అదరగొట్టాడు. ఇక సాయి పల్లవి నటనకు వంక పెట్టాల్సిన ఛాన్సే లేదు. ఇందులో ఆమె నాగ చైతన్య ప్రేయసి బుజ్జితల్లిగా యాక్ట్ చేసింది. వీరితో పాటు కరుణాకరణ్, ప్రకాశ్ బెలావాడి, దివ్య పిళ్లై, పృథ్వీ, కళ్యాణీ నటరాజన్, కల్పలత తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు చార్ట్ బస్టర్ గా నిలిచాయి. మరి థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యారా? లేదా మళ్లీ చూడాలనుకుంటున్నారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ లో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హీరోయిన్స్ డ్రెస్‌సెన్స్‌పై శివాజీ షాకింగ్ కామెంట్స్
హీరోయిన్స్ డ్రెస్‌సెన్స్‌పై శివాజీ షాకింగ్ కామెంట్స్
జనవరి 1 నుంచి మారనున్న రూల్స్.. ఇవి తెలుసుకోకపోతే ఇబ్బందే
జనవరి 1 నుంచి మారనున్న రూల్స్.. ఇవి తెలుసుకోకపోతే ఇబ్బందే
Video: కీర్తితో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన స్టార్ హీరో భార్య..
Video: కీర్తితో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన స్టార్ హీరో భార్య..
ఒక్క రాత్రికి 3 కోట్లు.. ఈ భామ బిజినెస్ రేంజ్ మామూలుగా లేదుగా!
ఒక్క రాత్రికి 3 కోట్లు.. ఈ భామ బిజినెస్ రేంజ్ మామూలుగా లేదుగా!
వెయ్యి కోట్లు దాటేసిన క్రేజీ బ్యూటీ.. టాప్ 5లో ఊహించని పేర్లు
వెయ్యి కోట్లు దాటేసిన క్రేజీ బ్యూటీ.. టాప్ 5లో ఊహించని పేర్లు
కూతురు పెళ్లి కబురుతో షాకిచ్చిన సీనియర్​ హీరో.. ఊహించని ట్విస్ట్!
కూతురు పెళ్లి కబురుతో షాకిచ్చిన సీనియర్​ హీరో.. ఊహించని ట్విస్ట్!
సంక్రాంతి స్పెషల్ రైళ్ల షెడ్యూల్స్ వచ్చేశాయి.. వివరాలు ఇవే..
సంక్రాంతి స్పెషల్ రైళ్ల షెడ్యూల్స్ వచ్చేశాయి.. వివరాలు ఇవే..
టెక్నాలజీతో దోస్తీ.. రోబోలతో పోటీ.. మీ పిల్లలను ఇలా రెడీ చేయండి
టెక్నాలజీతో దోస్తీ.. రోబోలతో పోటీ.. మీ పిల్లలను ఇలా రెడీ చేయండి
మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!
మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!
భారత్ బయోటెక్ మరో ఘనత.. మరో వ్యాధికి వ్యాక్సిన్
భారత్ బయోటెక్ మరో ఘనత.. మరో వ్యాధికి వ్యాక్సిన్