1000 Babies : గుండెల్లో దడ పుట్టించే హారర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా చూడాలంటే వణుకే.. అసలు మిస్ కాకండి..

హారర్ థ్రిల్లర్, రొమాంటిక్ లవ్ స్టోరీస్, క్రైమ్ మర్డర్ మిస్టరీ.. ఇలా విభిన్న కంటెంట్ చిత్రాలు, వెబ్ సిరీస్ చూసేందుకు ఓటీటీ అడియన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే అలాంటి తరహా కంటెంట్ మూవీస్ స్ట్రీమింగ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మెంటలెక్కించే ఓ హారర్ వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. అదే 1000 బేబీస్. మలయాళంలో రూపొందించిన హారర్ వెబ్ సిరీస్.

1000 Babies : గుండెల్లో దడ పుట్టించే హారర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా చూడాలంటే వణుకే.. అసలు మిస్ కాకండి..
1000 Babies
Follow us

|

Updated on: Oct 20, 2024 | 12:42 PM

హారర్ సినిమాలు చూడాలంటే ఎంతో ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఒంటరిగా చూడాలంటే మాత్రం భయమే. కానీ ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతున్న ఈ వెబ్ సిరీస్ మాత్రం గుండెల్లో దడ పుట్టిస్తోంది. హారర్ మూవీ లవర్స్‏కు సైతం వణుకు పుట్టించే వెబ్ సిరీస్ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంతకీ ఆ వెబ్ సిరీస్ ఏంటో తెలుసా.. ? అదే 1000 బేబీస్. మలయాళంలో నుంచి వచ్చిన ఈ న్యూ వెబ్ సిరీస్ హారర్ జానర్ కావడం విశేషం. ఇందులో సీనియర్ నటుడు రెహమాన్, నీనా గుప్తా ప్రధాన పాత్రలు పోషించగా.. సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ గా దీనిని రూపొందించారు. మొదటి నుంచి ఫస్ట్ లుక్, ట్రైలర్, టీజర్ ఇలా అన్నింటిని క్యూరియాసిటిని కలిగిన ఈ వెబ్ సిరీస్.. అక్టోబర్ 18 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. విడుదలైన ఒక్కరోజులోనే ట్రెండింగా్ లో టాప్ కు వచ్చేసింది.

మలయాళంలో రూపొందించిన ఈ 1000 బేబీస్ వెబ్ సిరీస్ ప్రస్తుతం ఏడు భాషలలో అందుబాటులోకి వచ్చింది. మలయాళంతోపాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మరాఠి, బెంగాళీ భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది. మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో ఈ సిరీస్ చూసేందుకు ఓటీటీ హారర్ మూవీ లవర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సిరీస్ కు మంచి వ్యూస్ వస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి నజీమ్ కోయ దర్శకత్వం వహించగా.. సంజు శివమ్, జాయ్ మాథ్యూ, ఆదిల్ ఇబ్రహీం, ఆశ్విన్ కుమార్ కీలకపాత్రలు పోషించారు. ఆగస్ట్ సినిమా బ్యానర్ పై షాది నదేషన్ ఆర్య ఈ సిరీస్ నిర్మించారు.

ఇది చదవండి : OTT Movie: అంతుచిక్కని రహస్యాలు.. మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు.. మైథిలాజికల్ థ్రిల్లర్ మూవీ ఎక్కడ చూడొచ్చంటే..

సస్పెన్స్ ట్విస్టులు, భయపెట్టించే విజువల్స్ తో ఈ సిరీస్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు. ఈ సిరీస్ కు మొదటి నుంచి పాజిటివ్ రివ్యూస్ రావడంతో వ్యూస్ పెరుగుతున్నాయి. మరీ ఈ సిరీస్ మీరు చూడాలనుకుంటే హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది.

ఇది చదవండి : Tollywood: వణుకుపుట్టించే థ్రిల్లర్ మూవీ.. ఈ సినిమాను అస్సలు మిస్సవద్దు..

Tollywood: ఈ అరాచకం ఏందీ సామి.. ఎన్టీఆర్‏తో కలిసి నటించిన ఈ హీరోయిన్ ఇలా మారిపోయిందేంటీ.. ? ఇప్పుడు చూస్తే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.