Cinema: ఏం సినిమా రా బాబూ ఇది.. రెండేళ్లుగా ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది.. ఒంటరిగా చూడాలంటే దడే..

హారర్ సినిమాలు చూడాలంటే చాలా మంది ఇష్టముంటుంది. కానీ ఒంటరిగా చూసేందుకు మాత్రం భయంతో వణికిపోతుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా మాత్రం థియేటర్లలోనే వణుకు పుట్టించింది. కానీ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. దాదాపు రెండేళ్లుగా ఈ సినిమా ఓటీటీలో చక్రం తిప్పుతుంది. ఇప్పుడు మరోసారి అడియన్స్ ముందుకు రాబోతుంది.

Cinema: ఏం సినిమా రా బాబూ ఇది.. రెండేళ్లుగా ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది.. ఒంటరిగా చూడాలంటే దడే..
Vash Movie

Updated on: Aug 16, 2025 | 7:39 PM

సాధారణంగా హారర్ సినిమాలకు స్టార్ హీరోహీరోయిన్స్ దూరంగా ఉంటారు. కానీ ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద చక్రం తిప్పిన సినిమాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ సినిమా దాదాపు రెండేళ్ల క్రితం విడుదలైంది. ఇప్పుడు ఈ సినిమా సెకండ్ పార్ట్ అడియన్స్ ముందుకు రాబోతుంది. కుటుంబ బంధాలను అతీంద్రియ అంశాలతో ముడిపెట్టి ఈ కథ సాగుతుంది. రోజువారీ జీవితంలో జరిగే అంశాలే కానీ ప్రతి క్షణం మిమ్మల్ని భయాందోళనకు గురిచేస్తుంటాయి. ఇది మిమ్మల్ని భయభ్రాంతులకు గురిచేసే భయంకరమైన ప్రపంచం. మనం మాట్లాడుకుంటున్న సినిమా వాష్. కృష్ణదేవ్ యాగ్నిక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2023లో విడుదలైంది.

ఇవి కూడా చదవండి: Actor: అన్నపూర్ణ స్టూడియో 50 ఏళ్ళు.. శంకుస్థాపన చేస్తోన్న చిన్నోడు ఎవరో తెలుసా..?

ఇందులో జానకి బోడివాలా, హితు కనోడియా, నీలమ్ పాంచల్, హితేన్ కుమార్ నటించారు. ఈ సినిమా 2025 ఆగస్టు 22న థియేటర్లలో మళ్లీ విడుదల అవుతుందని మేకర్స్ ప్రకటించారు. అతీంద్రియ శక్తులు, భావోద్వేగాల మిళితంగా ఈ సినిమా సాగుతుంది. తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు ఓ వ్యక్తి చేసే పోరాటమే ఈ సినిమా. ఉత్తమ సహాయ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును జానకి బోడివాలా గెలుచుకున్నారు. దాదాపు రూ. 3–3.5 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబడిన ఇది బాక్సాఫీస్ వద్ద రూ. 3.72 కోట్లు వసూలు చేసింది.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి: Dulquer Salman: ఆ హీరోయిన్ అంటే పిచ్చి ఇష్టం.. ఎప్పటికైనా ఆమెతో నటించాలనే కోరిక.. దుల్కర్ సల్మాన్..

ఈ చిత్రం మొదటి రోజు రూ. 15 లక్షలతో ప్రారంభమైంది. ఈ సినిమాను ఇప్పుడు మరోసారి ఆగస్ట్ 27న మరోసారి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షెమరూ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇవి కూడా చదవండి: అరాచకం భయ్యా.. వయ్యారాలతో గత్తరలేపుతున్న సీరియల్ బ్యూటీ..

ఇవి కూడా చదవండి: Actress : ఈ క్రేజ్ ఏంట్రా బాబూ.. 40 ఏళ్లు దాటిన తగ్గని జోరు.. 50 సెకండ్స్ కోసం 5 కోట్లు రెమ్యునరేషన్..