AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mothevari Love Story: ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న అనీల్ గీలా మోతెవరి లవ్ స్టోరీ.. ఇప్పుడు రూ.99లకే అన్‏లిమిటెడ్..

ఇండియాలో బిగ్గెస్ట్ ఓటీటీ సంస్థగా జీ5 టీం ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తోంది. తెలుగులో వరుసగా సిరీస్‌లు, సినిమాలు అందిస్తూ ఆడియెన్స్‌ను ఆశ్చర్యపరుస్తోంది. ఈక్రమంలో రీసెంట్‌గానే ‘మోతెవరి లవ్ స్టోరీ’ అంటూ జీ5 తన ప్రేక్షకుల్ని మెప్పించింది. ఇక ఇలాంటి అంతులేని వినోదాన్ని నెలకు కేవలం రూ.99 ల ప్లాన్‌తో వీక్షకులు డాల్బీ అట్మాస్ ఆడియోతో 4K నాణ్యతలో తెలుగు కంటెంట్‌ను 30 రోజుల పాటు 2 డివైస్ లో ఆస్వాదించవచ్చు.

Mothevari Love Story: ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న అనీల్ గీలా మోతెవరి లవ్ స్టోరీ.. ఇప్పుడు రూ.99లకే అన్‏లిమిటెడ్..
Mothevari Love Story
Rajitha Chanti
|

Updated on: Aug 16, 2025 | 5:06 PM

Share

భారతదేశంలో అతిపెద్ద స్వదేశీ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌గా ZEE5 దూసుకుపోతోంది. బ్లాక్‌బస్టర్ ఒరిజినల్ సిరీస్‌లను, సూపర్‌హిట్ సినిమాలను అన్ని భాషల్లో అందిస్తూ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటోంది. సాత్, నార్త్ మార్కెట్లలో ZEE5 ప్రస్తుతం దుమ్ములేపేస్తోంది. ఇక ZEE5 నిరంతరం ప్రాంతీయ భాషల్లో, ప్రాంతీయ కంటెంట్‌కు ప్రాధాన్యత ఇస్తూ.. తెలుగు, తమిళం, కన్నడ, మరాఠీ, గుజరాతీ, బంగ్లా, ఒడియా, భోజ్‌పురి, పంజాబీలలో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంది. ఈ క్రమంలోనే జీ5 తెలుగు ఇటీవల ‘మోతెవరి లవ్ స్టోరీ’ అంటూ ఓ అందమైన గ్రామీణ ప్రేమ కథను ఆడియెన్స్‌కు అందించింది. అనిల్ గీలా, వర్షిణిన ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన ఈ సిరీస్ ఆగస్ట్ 8న ప్రీమియర్ అయి.. అద్భుతమైన స్పందనను దక్కించుకుంది. కేవలం మూడు రోజుల్లోనే 4 లక్షలకు పైగా వ్యూయర్స్ ఈ సిరీస్‌ను వీక్షించారు. దీంతో రీజనల్ కంటెంట్ విభాగంలో ‘మోతెవరి లవ్ స్టోరీ’ సరి కొత్త బెంచ్ మార్క్‌ను సెట్ చేసినట్టు అయింది.

ఇవి కూడా చదవండి: Actor: అన్నపూర్ణ స్టూడియో 50 ఏళ్ళు.. శంకుస్థాపన చేస్తోన్న చిన్నోడు ఎవరో తెలుసా..?

ఈ కంటెంట్‌ను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి జీ5 తెలుగు ఇప్పుడు ₹99కి ప్రత్యేక నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌తో వీక్షకులు డాల్బీ అట్మాస్ ఆడియోతో 4K నాణ్యతలో తెలుగు కంటెంట్‌ను 30 రోజుల పాటు ఆస్వాదించవచ్చు, ఈ ప్లాన్ ప్రకారం గరిష్టంగా రెండు పరికరాల్లో యాక్సెస్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి: Dulquer Salman: ఆ హీరోయిన్ అంటే పిచ్చి ఇష్టం.. ఎప్పటికైనా ఆమెతో నటించాలనే కోరిక.. దుల్కర్ సల్మాన్..

ప్రాంతీయ వినోదం పట్ల తన నిబద్ధతను విస్తరించుకుంటూ ZEE5 హిందీ+పంజాబీ+భోజ్‌పురి, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ+గుజరాతీ, బంగ్లా+ఒడియాతో సహా ఇతర భాషలకు కూడా ఇలాంటి ₹99 నెలవారీ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది.

ఇవి కూడా చదవండి: అరాచకం భయ్యా.. వయ్యారాలతో గత్తరలేపుతున్న సీరియల్ బ్యూటీ..

ఇవి కూడా చదవండి: Actress : ఈ క్రేజ్ ఏంట్రా బాబూ.. 40 ఏళ్లు దాటిన తగ్గని జోరు.. 50 సెకండ్స్ కోసం 5 కోట్లు రెమ్యునరేషన్..