Good Luck Sakhi: ఓటీటీలో సందడి చేయనున్న కీర్తి సురేష్.. అమెజాన్ ప్రైమ్‌లో గుడ్ లక్ సఖి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keethy Suresh) ప్రధాన పాత్రలో నటించిన లేటేస్టే చిత్రం గుడ్ లక్ సఖి (Good Luck Sakhi). ఈ చిత్రాన్ని డైరెక్టర్ నగేష్ కుకునూర్ తెరకెక్కించారు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keethy Suresh) ప్రధాన పాత్రలో నటించిన లేటేస్టే చిత్రం గుడ్ లక్ సఖి (Good Luck Sakhi). ఈ చిత్రాన్ని డైరెక్టర్ నగేష్ కుకునూర్ తెరకెక్కించారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా గత నెల 28న విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఓ గ్రామీణ యువతి జాతీయ స్థాయి షూటర్‌గా ఎలా మారిందనే కథాంశంతో తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో టాలెంటెడ్ హీరో ఆది పినిశెట్టి .. జగపతి బాబు కీలకపాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో ‘వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్’ బ్యానర్ పై సుధీర్ చంద్ర పదిరి నిర్మించగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
తాజాగా ఈ సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. గుడ్ లక్ సఖి సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో ఫిబ్రవరి 12న స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు మేకర్స్. ఇక ఈ సినిమాతోపాటు.. తమిళ్ స్టార్ హీరో విశాల్ నటించిన సామాన్యుడు మూవీ కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం కీర్తి సురేష్.. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కిస్తున్న సర్కారు వారి పాట చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇక ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి కళావతి ఫస్ట్ సింగిల్ సాంగ్ రానుంది.
Keerthy Suresh-starrer Good Luck Sakhi to have digital premiere on Amazon Prime Video on 12 February#GoodLuckSakhionPrime @PrimeVideoIN pic.twitter.com/EnMQfozZYm
— Haricharan Pudipeddi (@pudiharicharan) February 9, 2022
Isha Chawla: ప్రేమకావాలి అంటూ ఒకసారి ఎంట్రీ.. డబల్ ధమాకాతో రీఎంట్రీ..’ఇషాచావ్లా’ న్యూ ఫొటోస్..
Meenakshi Chaudhary: అలాంటి సీన్స్ చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదంటున్న బ్యూటీ..