Bharateeyudu 2 OTT: అంచనాలు తారుమారు.. అప్పుడే ఓటీటీలోకి కమల్ హాసన్ భారతీయుడు 2.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
లోక నాయకుడు కమల్ హాసన్ - స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం భారతీయుడు 2. 1996లో ఇదే కాంబినేషన్ లో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ భారతీయుడుకు ఇది సీక్వెల్. అయితే అప్పటి మ్యాజిక్ ను భారతీయుడు 2 కొనసాగించలేకపోయింది. జులై 12న విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది.
లోక నాయకుడు కమల్ హాసన్ – స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం భారతీయుడు 2. 1996లో ఇదే కాంబినేషన్ లో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ భారతీయుడుకు ఇది సీక్వెల్. అయితే అప్పటి మ్యాజిక్ ను భారతీయుడు 2 కొనసాగించలేకపోయింది. జులై 12న విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. తమిళంలో భారీగానే వసూళ్లు సాధించినప్పటికీ తెలుగుతో సహా ఇతర భాషల్లోనూ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. భారతీయుడు 2 సినిమాలో భారీ తారాగణమే ఉంది. కమల్ హాసన్‌తో పాటుగా సిద్ధార్, రకుల్‌ప్రీత్ సింగ్, బాబీ సింహా, బ్రహ్మానందం, ప్రియా భవానీ శంకర్, కాజల్ అగర్వాల్ తదితరులు కీలకపాత్రలలో మెరిశారు. అయితే భారీ తారగణంతో పాటు విజువల్స్ ఆకట్టుకున్నా నీరసమైన కథా, కథనాలు భారతీయుడు 2 సినిమాను నిరాశపర్చాయి. థియేటర్లలో ఆడియెన్స్ ను మెప్పించలేకపోయిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. భారతీయుడు 2 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సూపర్ హిట్ మూవీ సీక్వెల్ కావడం, కమల్, శంకర్ లకు ఉన్న క్రేజ్ ఉండడంతో భారతీయుడు 2 సినిమా ఓటీటీ హక్కుల కోసం నెట్ ఫ్లిక్స్ భారీగానే ఖర్చు పెట్టిందని సమాచారం.
కాగా భారతీయుడు 2 సినిమా రిలీజ్ కు ముందే మేకర్స్, ఓటీటీ సంస్థల మధ్య డీల్ కుదిరింది. దీని ప్రకారం థియేట్రికల్ రిలీజ్ తర్వాత రెండు నెలలకు అంటే సెప్టెంబర్ 12 తర్వాతనే భారతీయుడు 2 ఓటీటీలోకి రావాల్సి ఉంది. అయితే సినిమా రిలీజ్ తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. అంచనాలు తారుమారయ్యాయి. రోజురోజుకు కలెక్షన్లు కూడా డ్రాప్ అవుతున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల థియేటర్ల నుంచి భారతీయుడు 2 సినిమా మాయమైపోయింది. దీంతో చాలామంది ఆడియెన్స్ ఇక ఓటీటీలోనే కమల్ హాసన్ సినిమాను చూద్దామని ఫిక్స్ అయ్యారు. ఈనేపథ్యంలో భారతీయుడు 2 సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ మారిందని టాక్. ముందుగా చేసుకున్న అగ్రిమెంట్ కాకుండా ఆగస్టు 2నే భారతీయుడు సినిమాను ఓటీటీలోకి రిలీజ్ చేయాలని నెట్ ఫ్లిక్స్ భావిస్తుందట. ఒక వేళ ఈ డేట్ కుదరకపోతే స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొచ్చే ఛాన్స్ ఉందట. త్వరలోనే దీనిపై ఒక అధికారిక ప్రకటన వెలువడనుంది.
భారతీయుడు సినిమా మేకింగ్ వీడియో..
Actress @Rakulpreet takes us behind the scenes of #Indian2 🇮🇳 Witness the dedication, challenges, and extraordinary moments that brought this grand spectacle to life! 🤩🔥@IndianTheMovie 🇮🇳 Ulaganayagan @ikamalhaasan @shankarshanmugh #Siddharth @actorsimha @anirudhofficial… pic.twitter.com/5DHeYWuWMt
— Lyca Productions (@LycaProductions) July 22, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.