OTT Horror Movie: ఇదెక్కడి ట్విస్ట్.. ఓటీటీలోకి మళ్లీ వచ్చేసిన హారర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ఈ సినిమా చూడాలంటే ప్రతిక్షణం భయంతో వణికిపోవాల్సిందే. థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న హారర్ మూవీ. ఇక ఇటీవల రీరిలీజ్ అయి ఏకంగా రూ.31 కోట్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన సినిమా. ఇప్పుడు మరోసారి ఓటీటీలో అడియన్స్ ముందుకు వచ్చింది. ఇంతకీ ఏ సినిమానో తెలుసా.. ?

హారర్ సినిమాలు చూడడమంటే మీకు ఇష్టమా.. ? అయితే ఇది మీకోసమే. మరాఠీ జానపద కథ ఆధారంగా రూపొందించిన హారర్ థ్రిల్లర్ మూవీ తుంబాడ్. మొదటిసారి థియేటర్లలో విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. కానీ గతేడాది రీరిలీజ్ చేయగా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్స్ తిరగరాసింది. 2018లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు అంతగా రెస్పాన్స్ రాలేదు. కేవలం రూ.12 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇక గతేడాది విడుదల కాగా.. ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఏకంగా రూ.31 కోట్లు వసూలు చేసింది. రీరిలీజ్ లోనూ అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా తుంబాడ్ హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ మూవీ గతంలో రెండు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ అయ్యింది. కానీ రీరిలీజ్ సమయంలో ఓటీటీలో కనిపించలేదు. ఇప్పుడు మరోసారి ఓటీటీలోకి వచ్చేసింది.
ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. గతంలో ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యేది. కానీ ఇప్పుడు అందులో కనిపించడం లేదు. తాజాగా ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ముంజ్యా, స్త్రీ 2 లాంటి హారర్ కామెడీ మూవీస్ థియేటర్లలో హిట్ కావడంతో.. అదే సమయంలో విడుదలన తుంబాడ్ మూవీ సైతం మంచి రెస్పాన్స్ అందుకుంది.
తుంబాడ్ సినిమా విషయానికి వస్తే.. వందేళ్లలో అసలు ఎవరూ వెళ్లని చోటికి వెళ్లి మరీ తుంబాడ్ సినిమా షూటింగ్ జరపడం విశేషం. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారు. రాహి అనిల్ బార్వే దర్శకత్వం వహించిన ఈ తుంబాడ్ మూవీలో సోహమ్ షా ప్రధాన పాత్ర పోషించారు. అనుక్షణం వణుకుపుట్టించే సీన్స్.. ఊహించని ట్విస్టులతో ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ సినిమా.
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన