Manjummel Boys OTT: అఫీషియల్.. మంజుమ్మెల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ డేట్ మారింది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఎట్టకేలకు మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ మంజుమ్మెల్ బాయ్స్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు కొన్న ప్రముఖ ఓటీటీ సంస్థ శనివారం (ఏప్రిల్ 27) అధికారిక స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేసింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

Manjummel Boys OTT: అఫీషియల్.. మంజుమ్మెల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ డేట్ మారింది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Manjummel Boys
Follow us
Basha Shek

|

Updated on: Apr 27, 2024 | 4:42 PM

ఎట్టకేలకు మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ మంజుమ్మెల్ బాయ్స్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు కొన్న ప్రముఖ ఓటీటీ సంస్థ శనివారం (ఏప్రిల్ 27) అధికారిక స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేసింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. గత కొన్ని రోజులుగా ముంజుమ్మెల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ పై తెగ రూమర్లు వస్తున్నాయి. దీనికి తోడు అఫీషియల్ స్ట్రీమింగ్ పార్ట్ నర్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కూడా ఓటీటీ రిలీజ్ డేట్ ను ప్రకటించకుండా దాగుడు మూతలు ఆడింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం మే 3న ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలోకి వస్తుందని అందరూ భావించారు. కానీ ఇప్పుడు మే3న కాకుండా రెండు రోజులు ఆలస్యంగా అంటే మే 5న ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రానుంది. మొత్తానికి మంజుమ్మెల్ బాయ్స్ ను ఓటీటీలో వీక్షించాలన్న మూవీ లవర్స్ నిరీక్షణకు ఇక తెరపడినట్లే. ఇక సినిమా విషయానికి వస్తే.. ఎలాంటి స్టార్ యాక్టర్స్ లేకుండా కేవలం రూ. 20 కోట్లతో తెరకెక్కిన మంజుమ్మెల్ బాయ్స్ మూవీ ఓవరాల్ గా రూ. 230 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మలయాళంలో రూ. 200 కోట్లు రాబట్టిన మొదటి సినిమా ఇదే కావడం విశేషం.

మంజుమ్మ‌ల్‌ బాయ్స్ మూవీలో సౌబీన్ షాహిర్‌, శ్రీనాథ్ భాసీ, బాలు వ‌ర్గీస్‌, దీప‌క్ ప‌రంబోల్‌తో పాలు ప‌లువురు కొత్త న‌టీన‌టులు కీల‌క ప్రధాన పోషించారు. చిదంబ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. స్ట్రాంగ్ కంటెంట్ ఉండడంతో మంజుమ్మెల్ బాయ్స్ సినిమాను తెలుగులో మైత్రీ మూవీ మేక‌ర్స్ డ‌బ్ చేసి రిలీజ్ చేయడం విశేషం. తెలుగులో కూడా ఈ మూవీ 12 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఇక కథ విషయానికి వస్తే..కి కేరళ నుండి స్నేహితుల బృందం కోడైకెనాల్ లోని ఒక గుహను చూడటాని విహార యాత్ర కు వెళతారు. అయితే స్నేహితుల్లో ఒకరు గుహలో పడిపోతారు. ఆ యువకుడిని ఆ స్నేహితులు ఎలా కాపాడుకున్నారు? వారికి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి, వాటిని ఎలా అధిగమించారన్నదే మంజుమ్మెల్ బాయ్స్ సినిమా.

ఇవి కూడా చదవండి

రెండు రోజులు ఆలస్యంగా స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.