
ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో అంతులేని వినోదాన్ని అందించే చిత్రాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. వారం వారం కొత్త కొత్త సినిమాలు అందుబాటులోకి వస్తున్నాయ. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి ఓటీటీల్లో హారర్, మిస్టరీ, సస్పెన్స్, రొమాంటిక్, కామెడీ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలోనే ఒక తెలుగు థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది. ఆ సినిమాలో ఉత్కంఠమైన ట్విస్టులు, మరుపురాని క్లైమాక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అదే ది 100. జూలై 11న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. ఈ సినిమా క్లైమాక్స్ మాత్రం అస్సలు ఊహించలేరు.
ఇవి కూడా చదవండి : Cinema: ఇది సక్సెస్ అంటే.. రూ.4 కోట్లు పెడితే.. రూ.121 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లను శాసించిన సినిమా..
కథ విషయానికి వస్తే.. హ్యాకర్ ప్రియుడితో గొడవ జరిగిన తర్వాత ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడంతో కథ ప్రారంభమవుతుంది. అదే సమంయలో విక్రాంత్ అనే ఐపీఎస్ అధికారికి హైదరాబాద్ సమీపంలో జరిగే వరుస దోపిడీలు, హత్యల కేసును దర్యాప్తు చేయాలని బాధ్యతను అప్పగిస్తారు. ఈ సినిమా ఆద్యంతం ఉత్కంఠంగా సాగుతుంది. ఊహించని మలుపు, క్లైమాక్స్ మిమ్మల్ని కట్టిపడేస్తాయి. విక్రాంత్ జీవితంలో వచ్చే పరిస్థితులు.. అతడి జీవితంలోకి ఆర్తి ఎంట్రీతో ఎలాంటి మలుపు తిరుగుతుందనేది సినిమా. ఈ సినిమా క్లైమాక్స్ మాత్రం అస్సలు మిస్ కాకూడదు.
ఇవి కూడా చదవండి : Tollywood : ఒకరు తోపు డైరెక్టర్.. ఇంకొకరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్.. ఈ ఇద్దరి టాలెంట్‌కు ప్రపంచమే జై కొట్టింది..
ది 100 మూవీ IMDBలో 7.6 రేటింగ్ కలిగి ఉంది. ఈ సినిమా ఉత్కంఠ, కథ బలానికి నిదర్శనం. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పుడే ఇది ట్రెండింగ్ నంబర్ వన్. రాఘవ్ ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మిషా నాయర్, ధన్య బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు.
ఇవి కూడా చదవండి : Serial Actres: 16 ఏళ్లకే ఆడిషన్.. ఆపై బీ గ్రేడ్ సినిమాలు.. ఈ సీరియల్ హీరోయిన్ కష్టాలు చూస్తే..
ఇవి కూడా చదవండి : Actress: తస్సాదియ్యా.. క్రేజీ ఫోటోలతో గత్తరలేపుతున్న యాంకరమ్మ.. ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టరా.. ?